నేడు భారత్ బంద్ కోసం పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా శుక్రవారం ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు 12గంటల పాటు ఈ బంద్ కొనసాగుతుందని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు వెల్లడించారు. రైలు, రోడ్డు రవాణా సర్వీసులను బ్లాక్ చేయాలని రైతు నేతలు నిర్ణయించారు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో రైలు, రోడ్డు రవాణా సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే, మార్కెట్లు, షాపింగ్ మాల్స్ సైతం మూసివేయాలని కోరారు.ఈ మేరకు బంద్ ను ఎక్కడా హింసాత్మకంగా మార్చకుండా కొనసాగించాలని కోరారు.బంద్‌ను శాంతియుతంగా నిర్వహించి తమకు మద్దతుగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.