దేశంలో కరోనా కలకలం కొనసాగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత పీక్స్ కి చేరనుందని అంచనా వేశారు సైంటిస్టులు. ఓ వైపు కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ, కరోనా మరణాల సంఖ్య మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇంకో వారం పాటు ఇదే స్థాయిలో మరణాల రేటు ఉండబోతుందని అంచనా వేస్తున్నారు వైద్య శాస్త్ర నిపుణులు.