హైదరాబాద్: కరంటు కోత ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వరంగల్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. కరంటు లేక వెంటిలేటర్ పనిచేయకపోవడంతో ఒకరు చనిపోయారు. ఖిలా వరంగల్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి అనారోగ్యంతో వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. ఈయనకు వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందించాల్సి వుంది. అయితే కరంటు లేని కారణంగా వెంటిలేటర్ పనిచేయలేదు. దీనితో శ్రీనివాస్కు ఆక్సిజన్ అందక చనిపోయారు. మ్రతుని బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: