విశాఖ నగరంలో రాజ్యసభ సభ్యుడు తిక్కవరపు వెంకట సుబ్బరామిరెడ్డి తన ఉనికిని చాటుకుంటున్నారు. ఇటీవల నెల్లూరు లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన తనకు విశాఖలో ఉన్న సంబంధాలను మళ్లీ కొనసాగిస్తున్నారు.   అక్కడి పార్లమెంటు సభ్యురాలు, కేంద్రమంత్రి అయిన పురందేశ్వరికి టెన్షన్ పుట్టిస్తున్నారు. అంతేకాకుండా విశాఖలో పేరుకుపోయిన కొన్ని సమస్యలపై తనదైన శైలీలో ఆయన స్పందిస్తున్నారు. ప్రత్యేకించి విలేకరులను పిలిచి నగరంలో కీలకమైన అంశాలపై తన అభిప్రాయాలను, తన వంతుగా చేసిన పినిని విశధీకరిస్తున్నారు. కెజిహెచ్ అభివృద్ది కోసం ప్రభుత్వరంగ సంస్థలు సుమారు రూ. 50 కోట్లు వెచ్చిస్తున్నాయి. అయితే సుబ్బరామిరెడ్డి తన వంతు కృషిగా పారిశ్రామికవేత్తల సహాయంతో రూ.30 కోట్లను అదనంగా సేకరించి అభివృద్ది శాశ్వతప్రాతిపాదికన ఉండేలా చూస్తున్నారు.  విశాఖ విమానాశ్రయం సేవలు 24 గంటలూ అందుబాటులో ఉండేలా చూడాలన్న పారిశ్రామికవేత్తల డిమాండ్లపై ఆయన స్పంధించారు. తాను కేంధ్రంలోని నేతలతో చర్చలు జరిపానని రెండు నెలల్లొ పూర్తిస్థాయి సవలు లభిస్తాయని ఆయన ప్రకటించారు. నగరవాసులు కోరికలు సాకారమవుతాయని, ప్రైవేటీకరిస్తారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టీల్ ప్లాంటు విషయంలో కూడా తాము ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని సుబ్బరామిరెడ్డి స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ స్టీలుప్లాంటును ప్రైవేటు పరం కానీయమని ఆయన హామీ ఇచ్చారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: