కాదేది ఆధార్ కు అనర్హం లేదా అన్నిటికి ఆధారే ఆధారం అనాలా? వంట గ్యాస్‌కు ఇప్పటికే ఆధార్‌తో లంకె పెట్టిన సర్కారు ఇక ఫై డ్రైవింగ్ లైసెన్సులు పొందాలన్నా, వాహనాల రిజిస్ట్రేషన్లు జరగాలన్నా ఆధార్ ను తప్పనిసరి చెయ్యనుంది. ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్సు పొందాలంటే నివాస ధృవీకరణ పత్రాలను లేదా రేషన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డును సమర్పిస్తే చాలు. కాని ఈ మేరకు ఆధార్‌ ను అనుసంధానిస్తూ త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. పాస్‌పోర్ట్‌ల జారీని సైతం 'ఆధార్'తో అనుసంధానించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా నిర్ణయించినట్లు సమాచారం. ఆధార్ అనుసంధానిత డ్రైవింగ్ లైసెన్సుల జారీ, వాహనాల రిజిస్ట్రేషన్లు, పాస్‌పోర్టుల మంజూరుకు కొంత గడువునివ్వాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియను హైదరాబాద్, రంగారెడ్డి, కృష్ణా, విశాఖపట్నం, వరంగల్ జిల్లాల్లో ప్రయోగాత్మక అమలుకు సన్నాహాలు చేస్తున్నారు, ఆ తర్వాత 2013 జూలై నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: