రాష్ట్రంలో ప్రధాన పక్షమైన తెలుగుదేశం పార్టీ వ్యూహం ఏంటో అంతుచిక్కని విధంగా ఉంది. ఒక్కరొక్కరుగా నాయకులు, ఎమ్మెల్యేలు పార్టీనుండి వెళ్లిపోతున్నారు. మరికొంత మంది నాయకులు పార్టీనుండి బహిష్కరణకు గురవుతున్నారు. తెలుగుదేశంపార్టీలో ఒక వెలుగువెలిగిన నాయకులు సైతం పార్టీకి దూరమయ్యారు. ప్రతిపక్షపార్టీగా ఉన్నటువంటి ఏపార్టీ అయిన ఎన్నికల సమయం నాటికి అధికారంలోకి రావడం కోసం కృషిచేస్తుంది. కాగా తెలుగుదేశం పార్టీ అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నట్లు పరిస్థితులను బట్టి స్పష్టమవుతుంది. కొంత మంది నాయకులు 2009 ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ తో పెట్టుకున్న పొత్తు సందర్భంగా తమకు టిక్కెట్ రాలేదన్న కారణంగా పార్టీనుండి వెళ్లి ఇతర పార్టీలో చేరి గెలుపొందిన సందర్భాలు సైతం ఉన్నాయి. కాగా 2009 ఎన్నికల్లో 92స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. అయితే 3సంవత్సరాల వరకే చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీనుండి వెళ్లి పోయారు. తెలంగాణ ప్రాంతంనుండే కాకుండా సీమాంధ్ర ప్రాంతం నుండి కూడా ఎమ్మెల్యేలు పార్టీనుండి వెళ్లారు. ఇందులో కొందరు వైఎస్ఆర్, టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో చేరిపోగా మరికొంత మంది స్వతంత్రులుగానే ఉన్నారు. 2009 సాదారణ ఎన్నికల్లో 92స్థానాల్లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ సంఖ్య నేడు 81 స్థానాలకు పడిపోయింది. 19 మంది ఎమ్మెల్యేలను పార్టీ దూరం చేసుకుంది. ఇందులో 14మంది ఎమ్మెల్యేలు పార్టీని విడిచి వెళ్లిపోగా గుడివాడ ఎమ్మల్యే నానీ 15రోజుల క్రితం వైఎస్ఆర్ సిపినేత జగన్మోహన్ రెడ్డిని కలిశారని, ఆపార్టీలో చేరబోతున్నాడనే ఆరోపనతో నానీని పార్టీనుండి బహిష్కరించారు. కాగా తాజాగా రాష్ట్రపతి ఎన్నికల్లో గీత దాటరని రామకోటయ్య, బాలనాగిరెడ్డి, హరిశ్వర్ రెడ్డి, వేణుగోపాలచారిలను తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. దీంతో పార్టీ 19మంది ఎమ్మెల్యేలను దూరం చేసుకుంది. కాగా ఇందులో హరీశ్వర్ రెడ్డి, వేణుగొపాలచారీలు ఇంకా ఏపార్టీలో చేరలేదు. భవిష్యత్తులో కేంద్రం తెలంగాణపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఆ పరిస్థితులను బట్టి నిర్ణయించుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా ఈపరిస్థితులను బట్టి చూస్తే పార్టీ మనుగడ ఏమిటనే అనుమానాలు కలుగుతాయి. రానున్న 2004సాదారణ ఎన్నికల నాటికి పార్టీ పిరాయింపులు ఇలాగే ఉంటే తెలుగుదేశంపార్టీ మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందనే అనుమానాలు కలుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: