పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర క్యాబీనెట్ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ అవకాశం దొరికినప్పుడుల్లా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఇరుకున పెడుతున్నారు. ఆయన పదవికి ఎసరు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో కరెంటుకోతలు, గ్యాస్ సరఫరాపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇబ్బందికలిగించేలా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరెంటు కష్టాలకు ఆయన ప్రజలను క్షమాపణ కోరటమే కాకుండా ప్రస్తుత పరిస్థితికి, గ్యాస్ రాకపోవటానికి కారణం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్లక్ష్యమే అన్నట్లుగా మాట్లాడారు. అంతేకాకుండా కేంధ్రమంత్రి జైపాల్ రెడ్డికి మద్దతుగా మాట్లాడి మరోచర్చకు తెరలేపారు. జైపాల్ రెడ్డి అసమర్థత వల్లే రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్ మహారాష్ట్ర కు తరలిపోయిందన్న విమర్శలు వస్తున్న నేపధ్యంలో బొత్స సత్యన్నారాయణ ఆయన్ను వెనుకేసుకురావటం విశేషం.  ఒకవైపు కేంధ్ర మంత్రిని వెనుకేసుకువస్తూ మరోవైపు ముఖ్యమంత్రికి ఇబ్బందులు కలిగేలా వ్యాఖ్యానించటంతో బొత్స వ్యూహం ఏమై ఉంటుందా అన్న అంశంపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. నిజానికి వీరిద్దరి మధ్య మొదటి నుంచి సఖ్యతకానీ, సయోధ్యకానీ లేదు. మధ్యం సిండికేటుపై ఏసీబీ దాడుల తరువాత వీరి మధ్యా అగాధం మరింత పెరిగింది. అంతకు ముందు ముఖ్యమంత్రి కిరణ్ తనకు పనికిమాలిన శాఖ కేటాయించారంటూ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.  రాజీవ్ యువకిరణాల పథకాన్ని క్యాబినెట్ లో చర్చించకుండానే కిరణ్ కుమార్ రెడ్డి ఏకపక్షంగా ప్రకటించారని కూడా బొత్స ఆరోపించారు. కిరణ్ కుమార్ కు వ్యతిరేకంగా కొందరు మంత్రులను బొత్స సత్యనారాయణ రెచ్చగొడుతున్నారని బోలెడు ఆరోపణలు వచ్చాయి. బొత్స వైఖరితో తాను విసిగిపోయి ఉన్నానని కిరణ్ కుమార్ రెడ్డి తన సన్నిహితుల వద్ద అంటున్నట్లు తెలిసింది. అయితే బొత్సను మాత్రం ప్రస్తుతం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: