తాను కరడుగట్టిన సమైక్యవాదినని, తెలుగువారందరు కల్సి ఉండాలన్నదే తన ద్యేయమని సమైక్యతా వాదాన్ని వినిపించిన సినినటుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి బాలకృష్ణ వైఖరిలో మార్పు వచ్చింది. తాను క్రీయశీలక రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించినప్పటి నుండి తనలో మార్పు వచ్చినట్లు కన్పిస్తుంది. గతంలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని వెనుకడుగు వేసినందుకుగాను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నష్టపోయిందని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు బాలకృష్ణకు వివరించడంతో బాలకృష్ణ తెలంగాణకు అనుకూలంగా తెలుగుదేశంపార్టీ మరోసారి లేఖ ఇస్తుందని ప్రకటించారు. కాగా తెలుగుదేశం పార్టీ నాయకుడు, రాజ్యసభసభ్యుడు, బాలకృష్ణ సోదరుడు నందమూరి హరికృష్ణ మాత్రం సమైక్యవాదినేనని అంటున్నాడు. తన శరీరంలో ఎన్టీఆర్ రక్తం ప్రవహించినంత కాలం సమైక్య వాదానికే కట్టుబడి ఉంటానని గతం నుండే ప్రకటిస్తున్నాడు. ఈ విషయంలో హరికృష్ణ ఇదివరకే టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు లేఖ రాశారు. కొన్ని రోజుల నుండి చంద్రబాబుకు దూరంగా ఉన్నటువంటి హరికృష్ణ సమైక్యతారాగం వినిపిస్తుండగా బాలకృష్ణ మాత్రం తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. ఒకే పార్టీలో, ఒకే కుటుంబంలో చెరో వాదం విన్పించడంతో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కొంత తలనొప్పి సమస్యగా మారింది. అయితే తెలంగాణకు అనుకూలంగా లేఖ రాస్తే సీమాంద్రనుండి ఎలాంటి వ్యతిరేక వస్తుందనే విషయంలో అక్కడి ప్రాంత నాయకులతో చంద్రబాబు సంప్రదించాడని, వారినుండి తెలంగాణ విషయంలో ఎలాంటి వ్యతిరేకత రాలేదని అందుకే తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడానికి చంద్రబాబునాయుడు సిద్దంగా ఉన్నారని తెలుస్తుంది. సంక్షోభంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని గట్టెక్కించడం కోసం తీసుకునే నిర్ణయాలలో తెలంగాణ ఇస్తే పార్టీ పటిష్టం అవుతుందని గ్రహిస్తే తెలంగాణకు అనుకూలంగా లేఖ అందజేసిన అభ్యంతరం లేదని సీమాంద్రప్రాంత నాయకులు చంద్రబాబుతో అన్నట్లు తెల్సింది.

మరింత సమాచారం తెలుసుకోండి: