విశాఖ సాగరతీరానికి మరో అట్రాక్షన్ రాబోతోంది. ఏషియాలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు విశాఖలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రతిష్టాత్మక నిర్మాణానికి  శంకుస్థాపన చేశారు. 9 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకోనున్న కన్వెన్షన్ సెంటర్ ను యుఏఈ కి చెందిన లూలూ గ్రూప్ నిర్మిస్తోంది. హోటల్స్, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన యుఏఈకి చెందిన లులూ గ్రూప్  అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ కన్వెన్షన్ సెంటర్ కు ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు.

Image result for lulu convention centre

విశాఖలో 9 ఎకరాల విస్తీర్ణంలో 700కోట్ల పెట్టుబడితో నిర్మించే కన్వెన్షన్ సెంటర్ ను అంతర్జాతీయ స్థాయిలో కనీవినీ ఎరుగని అధునాతన సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. 7వేల మందితో గ్లోబల్ ఈవెంట్స్ ను నిర్వహించుకునేలా భారీ కన్వెన్షన్ సెంటర్ తో పాటు అత్యాధునికమైన ఫంక్షన్ హాల్స్.. ఈ కన్వెన్షన్ సెంటర్ ప్రత్యేకత.. ఇక్కడ అన్ని ఫంక్షన్ లకు అనువైన అత్యాధునిక ఇంటీరియర్ డెకరేషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.  

Related image

అద్భుతమైన ఆతిథ్యం.. అత్యద్భుతమైన వాతావరణంలో 5 స్టార్ హోటల్ అదనపు అట్రాక్షన్ కాబోతోంది. అన్నింటికి మించి.. వరల్డ్ క్లాస్ షాపింగ్ మాల్.. ఆహారప్రియుల కోసం 50కి  పైగా ఫుడ్ కోర్ట్స్, 2 స్క్రీన్ మల్టిప్లెక్స్ థియేటర్లు, ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్, అమ్యూజ్ మెంట్ సెంటర్లతో నభూతో నభవిష్యత్ అన్న రీతిలో లులూ కన్వెన్షన్ సెంటర్ రాబోతోంది. 

Related image

కేవలం ఎంటర్ టైన్ మెంట్ కోణంలోనే కాదు.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పూర్తైతే విశాఖ చుట్టుపక్కల పదివేల మంది వరకూ ఉపాధి దొరకనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను తాము చేపట్టడం ఆనందంగా ఉందన్న లులు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ.. మంచి అభిరుచి గల ముఖ్యమంత్రితో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండాలో ఓ ఆర్కిటెక్ లా, ఇంజినీర్ లా చంద్రబాబు తమకు వివరించారని చెప్పారు. వీలైనంత త్వరగా ఈ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.

Image result for lulu convention centre vizag

‘విశాఖ’లో త్వరలో ఏర్పాటు చేయనున్న కన్వెన్షన్ సెంటర్ కు సముద్రతీరం అదనపు ఆకర్షణగా నిలుస్తుందని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.. 30నెలలలోపే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను పూర్తిచేయాలని చంద్రబాబు లులు ప్రతినిధులను కోరారు. ప్రాజెక్ట్ ను వీలైనంత త్వరగా పూర్తిచేసేలా ప్రభుత్వం అన్నిరకాల సహకారం అందిస్తామన్న చంద్రబాబు.. వీలైతే వచ్చే సీఐఐ సదస్సు ఈ కన్వెన్షన్ సెంటర్ లోనే జరుపుదామని ఆకాంక్షించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: