హైదరాబాద్: మునుపెన్నడూ లేని విధంగా బంగారం ధరలు ఆమాంతం పెరిగిపోతున్నాయి. గత ఆరేళ్లలో బంగారం ధరలు రెండింతలు పెరిగింది. బంగారానికి ఏమైనా రెక్కలు వచ్చాయా? అనే విధంగా రోజు రోజుకూ ధరలు పెరిగిపోతున్నాయి. బంగారం చరిత్రలోనే 10గ్రాముల కు 31వేలు దాటింది. ఈ ధర ముంబాయి, చెన్నై, హైదరాబాద్ లలోనే. పట్టణాలు, పల్లెలకు వచ్చే సరికి 32వేల రూపాయలకు చేరుకుంటుంది. దేశీయయ, అంతర్జాతీయ విపణిలో బంగారం ధరలు దూసుకుపోతూ రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 30వేలు రూపాయలు మాత్రమే వుంది. కానీ, ఆధరను నేడు దాటింది. దేశీయ మార్కెట్ లో సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా బాగానే పెరిగాయి. గతంలో ఆషాఢ మాసంలో బంగారాన్ని కొనుగోలు చేసేవారు కాదు. పెళ్లిళ్ల సీజన్ అయిన ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, నవంబర్, డిసెంబర్ నెలల్లో అధికంగా బంగారాన్ని కొనుగోలు చేసేవారు.  కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. ఎప్పుడుపడితే అప్పుడు బంగారాన్ని కొంటున్నారు. అంటే, జనం చేతిలో ఎప్పుడు డబ్బుంటే అప్పుడు ఎంతో కొంత బంగారాన్ని కొనుక్కుంటున్నారు. అది ఆషాఢం కావచ్చు, శ్రావణం మాసం కావచ్చు. దేశీయంగా బంగారం ధర పెరగడానికి స్థానిక కొనుగోళ్లతో పాటు అంతర్జాతీయ పరిణామాలు కూడా కారణంగా తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: