ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇచ్చిన హామీతో ఓ సీనియ‌ర్ నేత‌కు మంత్రి ప‌ద‌వి మిస్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఆయ‌న అనుచ‌రులు త‌మ నేత‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌న్న డిమాండ్లు తీసుకు వ‌స్తున్నారు. ఓట‌మి లేకుండా వ‌రుస‌గా నాలుగుసార్లు గెలిచిన మా నేత‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇంత‌కు నాలుగుసార్లు గెలిచినా మంత్రి ప‌ద‌వి ఖ‌చ్చితంగా రాని ఆ వైసీపీ లీడ‌ర్ ఎవ‌రు ? జ‌గ‌న్ ఎవ‌రికి ప్రామీస్ చేశారో ? ఆ స్టోరీ ఏంటో చూద్దాం.


గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్మెల్లి రామ‌కృష్ణారెడ్డి వ‌రుస‌గా నాలుగుసార్లు విజ‌యం సాధించారు. 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న 2012 ఉప ఎన్నిక‌ల్లో రెండోసారి వైసీపీ నుంచి గెలిచారు. తొలిసారి కాంగ్రెస్ నుంచి గెలిచిన పీఆర్కే ఆ త‌ర్వాత మూడు ఎన్నిక‌ల్లోనూ వైసీపీ నుంచి విజ‌యం సాధించారు. గ‌త ఎన్నిక‌ల్లో కూడా టీడీపీ ఏపీలో అధికారంలోకి వ‌చ్చినా మాచ‌ర్ల‌లో మాత్రం 3 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక ఈ ఎన్నిక‌ల్లో ఈ సారి ఇక్క‌డ టీడీపీ గెలుస్తుంద‌ని అంద‌రూ భావించినా పీఆర్కే అంచ‌నాలు త‌ల్ల‌కిందులు చేస్తూ నాలుగోసారి గెలిచారు. 


ఈ సారి నాలుగోసారి విజ‌యం సాధించినందుకు పీఆర్కేకు మంత్రి ప‌ద‌వి ఖ‌చ్చితంగా వ‌చ్చి ఉండేది. అయితే మంగ‌ళ‌గిరిలో లోకేష్‌పై పోటీ చేసిన ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి కోసం ప్ర‌చారం చేసిన జ‌గ‌న్ ఈ సారి అక్క‌డ ఆళ్ల‌ను గెలిపిస్తే కేబినెట్‌లో త‌ప్ప‌నిస‌రిగా బెర్త్ ఇస్తాన‌ని బ‌హిరంగంగా ప్రామీస్ చేశారు. దీంతో మంగ‌ళ‌గిరి ప్ర‌జ‌లు ఆళ్ల‌ను వ‌రుస‌గా రెండోసారి గెలిపించారు. లోకేష్‌పై ఆయ‌న తిరుగులేని విజ‌యం సాధించారు. దీంతో అక్క‌డ జ‌గ‌న్ ప్రామీస్ నేప‌థ్యంలో ఆయ‌న‌కే మంత్రి ప‌ద‌వి రానుంది.


గుంటూరు జిల్లాలో ఇప్ప‌టికే రెడ్డి వ‌ర్గం కోటాలో ఆళ్ల‌కు, క‌మ్మ కోటాలో మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు బెర్తులు ఖాయ‌మ‌య్యాయి. ఇక ఎస్సీ, లేడీ కోటాలో మూడోసారి గెలిచిన సుచ‌రిత పేరు వినిపిస్తోంది. ఇప్పుడు మ‌ళ్లీ రెడ్డి కోటాలో పీఆర్కేకు కేబినెట్ సీటు క‌ష్ట‌మే. ఇక ప‌ల్నాడులోని గురజాల, మాచర్ల నియోజకవర్గాలు ఏర్పడిన 64 సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యేకు ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి మంత్రి ప‌ద‌వి ఏ పార్టీ త‌ర‌పునా కూడా రాలేదు. ఇప్పుడు అయినా పీఆర్కేకు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న ఆశ‌లు ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఉన్నా జ‌గ‌న్ ఆళ్ల‌కు చేసిన ప్రామీస్‌తో పీఆర్కేకు బ్యాడ్‌ల‌క్ అయ్యింది.



మరింత సమాచారం తెలుసుకోండి: