అమరావతి నిర్మాణంలో
ఉల్లంఘనల వల్లే రాజధాని నిర్మాణానికి తాము
నిధులు ఇవ్వలేకపోతున్నట్లు ప్రపంచ బ్యాంకు తన వెబ్ సైట్ ద్వారా ప్రకటించింది.
రాజధాని నిర్మాణానికి రూ. 2100 కోట్లు ఇవ్వటానికి ముందుగా ప్రతిపాదనలు
సిద్ధమయ్యాయి. అయితే తర్వాత నిబంధనలను అమలు విషయంలో లోతుగా పరిశీలించిన ప్రపంచ
బ్యాంకు ఏజెన్సీలకు అడుగడుగునా నిబంధనలకు నీళ్ళొదిలినట్లు అర్ధమైంది.
అందుకనే తన వైఖరిని మార్చుకున్నట్లు తాజాగా ప్రకటించింది. అమరావతి నిర్మాణ ప్రాజెక్టులో లొసుగుల వల్ల, పర్యావరణ చట్టాలను ఉల్లంఘించటం వల్ల తాము ఫండింగ్ చేయలేకపోతున్నట్లు స్పష్టంగా చెప్పింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్లే ప్రపంచ బ్యాంకు నిధులు ఇవ్వలేక వెనక్కు వెళ్ళినట్లు చంద్రబాబునాయుడు అండ్ కో ప్రచారం మొదలుపెట్టింది.
మొదటి నుండి అమరావతి ప్రాజెక్టును వ్యతిరేకిస్తు అనేక స్వచ్చంధ సంస్ధలు పోరాటాలు చేస్తున్నాయి. పర్యావరణ అనుమతులను చంద్రబాబు ఉల్లంఘిస్తున్నట్లు పర్యవారణ సంస్ధలు కోర్టుల్లో కేసులు కూడా వేశాయి. అదే విషయాన్ని వైసిపితో పాటు వామపక్షాలు కూడా ఎప్పటి నుండో మొత్తుకుంటున్నాయి. ఎవరెన్ని చెప్పినా చంద్రబాబు మాత్రం లెక్క చేయక ముందుకే వెళ్ళారు. అయితే ప్రభుత్వం మారిపోవటంతో గతంలోని ఆరోపణలే ఇపుడు నిజాలయ్యాయి.
రాజధాని నిర్మాణం పేరుతో పచ్చగా ఏడాదికి మూడుపంటలు పండే భూములను రైతుల నుండి లాగేసుకోవటం, పంటలను ధ్వంసం చేశారు. ఫలితంగా ఆహార ఉత్పత్తి సమస్యలు వస్తాయని నిపుణులు ఎంతో చెప్పారు. సారంవంతమైన భూములన్నీ చంద్రబాబు నిర్వాకం వల్ల బీడు భూములుగా మారిపోయే ప్రమాదం ముంచుకొస్తోంది. రకరకాల మార్గాల్లో తమకందిన ఫిర్యాదుల వల్ల ప్రపంచ బ్యాంకు బృందం రాష్ట్రానికి వచ్చి పరిశీలించింది. మొత్తానికి వివాదాస్పదమైన ప్రాజెక్టుకు నిధులు ఇవ్వలేమని తేల్చేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి