శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద పోటెత్తుతోంది. మొన్నటి కృష్ణా వరదల సమయంలో రాయలసీమకు దాదాపు 70 టీఎంసీల వరకూ తరలించారు. ఇప్పుడు మళ్లీ వరద పోటెత్తడంతో మరిన్ని జలాలు తరలించే అవకాశం ఉంది. శైలం జలాశయానికి ఇన్‌ఫ్లో 2,27669 క్యూసెక్కులుగా ఉంది.. శ్రీశైలం జలాశయం ఔట్‌ఫ్లో 97,714 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 883.60 అడుగులు..


శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215.80 టీఎంసీలు.. కాగా.. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటి నిల్వ 207.84 టీఎంసీలు.. కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 30,648 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 38,140 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2400 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. హంద్రీనీవాకు 2,026 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 24,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.


ఇలా శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద రావడానికి ఎగువన ఉన్న పరిస్థితులే కారణం.. కర్ణాటకలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్రం నుంచి భారీగా వరద వస్తోంది. కర్ణాటకలోని నారాయణపూర్ జలాశయంకు ఇన్ ఫ్లో 2 లక్షల 60 వేల క్యూసెక్కులుగా ఉంది. అంత జలం ప్రాజెక్టు లోకి వచ్చి చేరుతుండగా... ప్రాజెక్టు నుండి దిగువకు 2 లక్షల 62 వేల 280 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.


ఆ వరద తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాకు చేరుతోంది. కర్ణాటక ప్రాజెక్టు నుండి జూరాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది . జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 9.336 టీఎంసీ లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం 318.360 మీటర్లుగా ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి ఇన్ ఫ్లో 2 లక్షల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు లోకి వచ్చి చేరుతుంది. జూరాల 16 గేట్లు ఓపెన్ చేసి దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 2 లక్షల 8 వేల 500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: