
కోడి పందెం ఎక్కువగా సంక్రాంతి సమయంలో జరుగుతూ ఉంటుంది. అదికూడా భీమవరం వైపు బాగా ఫేమస్. అయితే అది కాస్త ఈ మధ్య ప్రకాశం జిల్లాకు కూడా పాకింది. దీంతో వీళ్ళు సంక్రాంతి వరుకు ఆగలేక.. దసరాకు, దీపావళి పండుగలకు కోడి పందాలు జోరుగా జరిపారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.
ఆ సమయంలో కోడిపందెం జోరుగా సాగుతుంది. సరిగ్గా ఆ సమయానికి పోలీసులు అక్కడికి వచ్చారు. దీంతో పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయే సమయంలో ముగ్గురు వ్యక్తులు అక్కడ ఉన్న నీటి కాలువలో పడి గల్లంతయ్యారు. అయితే వారి మృతుదేహాలను ఈరోజు బయటకు తియ్యగా ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇంకా వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లాలోని చీరాల మండలం విజయనగర్ కాలనీ శివార్లలో కోడి పందాల స్థావరాలు ఉన్నాయని పోలీసులు తెలుసుకున్నారు. ఆ సమయంలోనే దాడులు చేశారు. పోలీసులను చుసిన ముగ్గురు నిర్వాహకులు పారిపోయే క్రమంలో మృతి చెందారు. ఇద్దరి మృతుదేహాలు లభ్యం కాగా మరో వ్యక్తి మృతుదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే చనిపోయిన ఇద్దరిలో ఒకరు శ్రీను, మరొకరు మధుగా పోలీసులు గుర్తించారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.