ఇప్పుడు జరుగుతున్న విభజనతోనే నిండా మునిగిపోయే ప్రమాదంలో పడ్డ సీమాంద్రకు మరింత ప్రమాదం పొంచి ఉందన్న సంకేతాలు జారీ అయ్యాయి. కారణం వారి నేతలు ఇప్పటికి సీమాంద్రవారికి కావాల్సిందేదో అడక్కుండా వారి రాజకీయ ప్రయోజనాలకోసమే విడిపోయి కొట్లాడుతుంటే, ఇప్పటికే ప్రధానమైన విభజన కోరిక నెరవేర్చుకున్న తెలంగాణ నేతలు అందరు ఒక్కటై మరిన్ని ప్రయోజనాలు సాధించేందుకు పోరాడాలని నిర్ణయించారు. దీంతో ఇప్పటికే నాశనం అవుతుంది అని భయడుతున్న సీమాంద్ర సర్వనాశనం అయ్యే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. కారణం వారికి కావాల్సిన వాటి కోసం వారి తరఫున పోరాడే వారు లేకపోగా, వారికి అంతో ఇంతో మిగిల్చిన వాటిని కూడా లాక్కుపోయేందుకు తెలంగాణ వారంతా సమిష్టిగా పోరాడితే అడిగిదంతా కాకున్న ఎంతో కొంత సాదించడం మాత్రం ఖాయం అన్నది వాస్తవం. ఏ భయంతోనైతే ఉద్యోగులంతా తమ సర్వశక్తుల ఒడ్డి సమైక్య ఉద్యమం చేసారో వారికే ఎసరు పెట్టాలని తెలంగాణవారు నిర్ణయించిన దానిలో ఉంది. అదే సీమాంద్ర ఉద్యోగులందరిని తెలంగాణ ఏర్పడ్డాక వారి ప్రాంతాలకే పంపించాలని. ఇక సీమాంద్ర వారు తమ ప్రాణం అంతా పెట్టి వ్యాపారాలు, ఉద్యోగాలు, ఆస్తులు ఇలా అన్ని సంపాదించుకున్న హైదరాబాద్ పై కూడా పెత్తనం తెలంగాణకే ఉండాలన్నది మరో కోరిక. పోలవరం వారికిస్తే విద్యుత్ మాకివ్వాలన్నది ఇంకో నిర్ణయం. ఇలా సీమాంద్రను నిండా ముంచే కోరికలెన్నింటినో సాదించాలని, దీనికోసం పార్టీలన్నీ కలిసి ఉమ్మడి ప్రణాలికతో కలిసి పోరాడాలని నిర్ణయించారు తెలంగాణలో. కలసిపోరాడి ఏకంగా తెలంగాణ సాదించుకున్న వారు అదే మంత్రంతో ఇవి కూడా సాదించుకుంటే పరిస్థితి ఏంటి. పైగా ఈ అవకాశాలు కూడా లేవని చెప్పలేం, కారణం సాద్యం కాదని తెలిసి సమైక్యం అంటూ విడిపోయి కొట్లాడుకుంటున్నారు సమైక్య నేతలు. కనీసం ఇది కావాలని పోరాడడం మాట అటుంచి సీమాంద్రకు అన్యాయం జరిగే విదంగా హైదరాబాద్, పోలవరం విషయంలో భద్రాచలం వంటి వాటిని దూరం చేస్తే కూడా పోరాడడం లేదు. అడగందే అమ్మయినా అన్నం పెట్టదన్నది అందరికి తెలిసిందే. అందుకే వారు ఏమి అడగనప్పుడు వారికిచ్చే బదులు అడిగిన వారికి అడిగింది ఇచ్చి వారివద్దనైనా మంచి పేరు తెచ్చుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తే సీమాంద్రుల నోట నిండా మన్ను పడ్డట్టే. అందుకే ఇప్పడైనా కళ్లు తెరచి కొట్టుకోవడం ఆపి వారిని రేపు అందలం ఎక్కించే ప్రజలకోసం కాకున్నా రేపు అధికారంలోకి వచ్చాకా నిండా కోల్పోయిన వారి రాష్ట్రాన్ని సక్రమంగా ఎలా పాలిస్తారు, అందుకోసమైనా కలిసి పోరాడాల్సిన అవసరం ఉందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: