అవును ఇప్పుడు బాలకృష్ణ అలుళ్ల పరిస్థితి చూస్తే అలాగే ఉంది. నందమూరి బాలకృష్ణ పెద్దల్లుడు నారా లోకేశ్ సంగతి అందరికీ తెలిసిందే. చిన్నల్లుడు విశాఖ కు చెందిన గీతం విద్యాసంస్థల అధిపతి భరత్. ఈయన మొన్న విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. మొన్నటి ఎన్నికల్లో బాలయ్య ఇద్దరు అల్లుళ్లు ఓడిపోయారనుకోండి. పాపం బాలయ్య మాత్రమే గెలిచారు.

                                          

అయితే ఇప్పుడు సీఎం జగన్ తీసుకున్న రాజధాని మార్పు నిర్ణయంతో కొత్త చిక్కు వచ్చిపడంది. సీఎం నిర్ణయాన్ని పెద్దల్లుడు నారా లోకేశ్ వ్యతిరేకిస్తున్నారు. పార్టీ కూడా వ్యతిరేకిస్తుందుకోండి. లోకేష్ మంగళగిరిలో విశాఖకు రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ కాగడాల ప్రదర్శన కూడా చేశారు. చంద్రబాబు నాయుడు కూడా ఆయా వర్గాల వారిని సమీకరించి అమరావతికి మద్దతుగా మాట్లాడిస్తున్నారు.

 

ఇలాంటి సమయంలో బాలయ్య చిన్నల్లుడు మాత్రం విశాఖకు రాజధాని తరలింపు నిర్ణయాన్ని సమర్థిస్తున్నాడు. ఒక వైపు చంద్రబాబు అమరావతి రాజధాని యథావిథిగా ఉండాలంటూ ఆదోళనలకు మద్దతు ఇస్తుంటే.. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు విశాఖపట్నం కార్యనిర్వాహఖ రాజధాని కి మద్దతు ఇస్తూ తీర్మానం చేశారు. జగన్ నిర్ణయాన్ని విశాఖ జిల్లా టిడిపి ఎమ్మెల్యేలు, నేతలు సమావేశం జరిపి విశాఖలో రాజధాని కి స్వాగతం తెలిపారు.

 

గంటా శ్రీనివాసరావు, గణేష్ కుమార్,గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు లతో పాటు ఎమ్.పి గా పోటీచేసి ఓడిన భరత్ తదితరులు ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చారు. అంటే బాలయ్య పెద్దల్లుడు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంటే చిన్నల్లుడు మాత్రం స్వాగతిస్తున్నాడన్నమాట. అంటే ఏ ప్రాంతానికి చెందిన నాయకులు ఆ ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడుతున్నారన్నమాట. మరి ఒక కుటుంబంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. మరి ఇక రాష్ట్రమంతటా టీడీపీ పరిస్థితి ఎలా ఉందో ఏమిటో అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. పాపం.. అందరినీ ఒక తాటిపై ఉంచలేక చంద్రబాబు సతమతమవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: