పొట్లూరి వరప్రసాద్ అలియాస్ పీవీపీ.. ఆయన 2019 ఎన్నికల్లో పోటీ చేసి అప్పుడు ఎదురైన పరాజయం నుంచి తేరుకొని మళ్లీ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటాడు. పొట్లూరి వరప్రసాద్ మొదట వ్యాపార రంగం ఎంచుకుని అక్కడ రాణించి అనంతరం టాలీవుడ్‌ కు వెళ్లి అక్కడ సక్సెస్ సాధించి అక్కడి నుంచి మళ్లీ రాజకీయాల వైపు అడుగులు వేశారు వరప్రసాద్..   


 
ప్రస్తుతం పొట్లూరి వరప్రసాద్ వ్యాపారాలకు, సినిమాలకు.. ఇండస్ట్రీకి  కాస్త దూరంగా ఉంటూ సీరియస్‌ గా రాజకీయాల పై ఫోకస్ పెట్టారు. గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన ఆయన తేరుకుని మల్లి రాజకీయం వైపు వస్తున్నారు. ఆయన ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటాడు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో దూకుడు పెంచాడు. ప్రస్తుత ప్రభుత్వానికి మద్దతిస్తూ.. టీడీపీ తో పాటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేస్తూ.. జగన్ చేస్తున్న సంక్షేమ పథకాల పై ఆయన స్పందిస్తున్నారు. సినిమా నాలెడ్జ్‌ ఉన్న అయన కాస్త పంచ్‌ లు జోడించి ప్రత్యర్థి పార్టీల పై పంచ్ ల వర్షం గుప్పిస్తున్నారు.

 

పీవీపీ తాజాగా పింఛన్ పంపిణీ కార్యక్రమం పై తనదైన సినిమా స్టైల్ లో స్పందించారు. ఆంధ్ర ప్రజలారా... పెన్షన్ ఇంటికి పంపించే ప్రభుత్వం ఒకటి, ఉద్యోగులను నిరుద్యోగులను చేసి ఇంటికి పంపే ప్రభుత్వం ఇంకొకటి.. ఇక మీరే ఎంపిక చేసుకోండి ఆంధ్రులారా.. ; చంద్రగ్రహణమా లేక జగన్మోహనమా.. జై ఆంధ్రా అంటూ పీవీపీ (పొట్లూరి వరప్రసాద్) ట్వీట్ చేశారు.

 

గతంలో పీవీపీ చేసిన ట్వీట్‌ లో కృష్ణా కరకట్ట పై రిటైనింగ్ వాల్‌ కోసం రూ.126 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ అంశాన్ని ఉద్దేశిస్తూ... ముఖ్యమంత్రి జగన్ గారికి ధన్యవాదాలు కృష్ణలంక కరకట్ట వాసుల కల నెరవేర్చారన్నారు. వారందరి తరుపున మీకు హృదయపూర్వక ధన్యవాదములు అని పీవీపీ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: