ఏపీలో పత్రికలు, ఛానళ్లు పార్టీల వారీగా విడిపోయిన సంగతి తెలిసిందే. అబ్బే మేం పక్షపాత రహితంగా వార్తలు ఇస్తున్నాం అని పైకి చెప్పుకున్నా.. ఏ ఛానల్ ఏ పార్టీ కోసం పని చేస్తుందో.. ఏపీలో ప్రజందరికీ తెలిసిందే. అందుకే ఎన్నికల సమయంలో ఈ పత్రికలు, ఛానళ్లలో వచ్చిన కథనాలకు ఎవరూ ప్రభావితం కావడం లేదు. అదే జరిగితే.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో.. అంతకుముందు జరిగిన ఎన్నికల్లోనూ జగన్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి దారుణంగా ఓడిపోయేవారు. కానీ జనం ఈ మీడియాలను పట్టించుకోడం లేదు.

 

 

అయినా సరే.. ఏపీలో చంద్రబాబు అనుకూల మీడియా తన వంతు ప్రయత్నాలు మానడంలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న ఘటనలు గ్లోరిఫై చేస్తూ రాష్ట్రంలో అరాచకం సాగుతోందని ప్రచారం చేస్తున్నాయి. దీనిపై ఏపీ సీఎం జగన్ మండిపడ్డారు. చంద్రబాబు తనకి చెందిన పత్రికలు, టీవీ ఛానెళ్ల ఆసరాతో ఈ ఎలక్షన్లకు సంబంధించి నానా యాగీ చేస్తున్నాడని మండిపడ్డారు.

 

 

" రాష్ట్రంలో 10,243 ఎంపీటీసీలు, జడ్పీటీసీలు జరిగితే..54,594 నామినేషన్లు అన్ని పార్టీల వాళ్లూ వేస్తే కేవలం చెదురు మదురు జరిగిన ఘటనలు 43. 2794 వార్డులు డివిజన్లలో పోటీ జరుగుతుంటే 15185 నామినేషన్లు పడ్డాయి. వీటిలో 14 చోట్ల చెదురుమదురు ఘటనలు జరిగాయి. లోకల్ బాడీల్లో ఈ మేరకు జరగకుండా ఎక్కడైనా ఉందా? ఇంత తక్కువ ఎప్పుడైనా జరిగాయా? ఇంతకంటే ఎక్కువ అల్లర్లే జరగలేదా?ఇదంతా విష ప్రచారం, రాక్షసక్రీడకు పాల్పడటం కాదా? మీకు చానెళ్లు, పేపర్లు నాలుగు ఎక్కువ ఉన్నాయి అని ఇంత దారుణానికి పాల్పడటం కరెక్టేనా? అంటూ సీఎం జగన్ నిలదీశారు.

 

మా పోలీసుల గురించి గర్వంగా చెబుతాఅటెమ్టివ్ మర్డర్ కేసులు కూడా నమోదులు చేశారు. ప్రేక్షకపాత్ర వహించలా. ఎవరినీ ఉపేక్షించలా. వారు వారి డ్యూటీ సిన్సియర్ గా చేసారు. యునానమస్ గురించి మాట్లాడితే..ఇంతకుముందు 2013 లో లోకల్ బాడీ ఎలక్షన్లో ఎంపీటీసీ ల్లో టీడీపీ సత్తా చాటింది అని అప్పటి చంద్రబాబు అనుకూల మీడియా రాయలేదా... అని జగన్ నిలదీశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: