మనం భగవంతుడిని ఎంతగా విశ్వసిస్తామో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఈ కాలంలో మనుషుల మద్య ఉంటే దైవదూతలుగా 'భగవంతుని అవతారం' అని కీర్తింపబడ్డ వారిలో షిరిడీ సాయిబాబ ఒకరు.  ఆయన తర్వాత ఆ స్థాయిలో కీర్తింపబడ్డవారిలో పుట్ట పర్తి సాయిబాబు ఒకరు. సత్య సాయి బాబా జన్మనామము సత్యనారాయణరాజు . 1926 నవంబరు 23న పుట్టపర్తిలో జన్మించాడు.'గురువు' అనీ, 'వేదాంతి' అనీ, 'భగవంతుని అవతారం' అనీ పలువురు విశ్వసిస్తారు. ఈయన 2011 ఏప్రిల్ 23న నిర్యాణం చెందారు. పుట్టపర్తిలో ఆథ్యాత్మిక కేంద్రం ప్రశాంతి నిలయం వెలుగొందుతుంది.  

 

ఇక్కడ ఎంతో మంది వైద్యం కోసం, విద్య కోసం వచ్చేవారు ఉన్నారు. మనసు శాంతనం చేసుకోవడానికి కూడా ఇక్కడికి వస్తుంటారు.  అయితే పుట్టపర్తి సాయిబాబ నిర్యాణం తర్వాత కూడా ఇక్కడ ఎంతో మంది ఆయన సందేశాలు వినడాకి ఇక్కడికి వస్తుంటారు. పుట్టపర్తి సాయి బాబా శిష్యులు ఇక్కడే తమ ఆవాసం ఏర్పాటు చేకొని శాంతి బోదన చేస్తున్నారు.  అలాంటి పుట్టపర్తిలో ఇప్పుడు కరోనా కలకలం చెలరేగింది. అనునిత్యం ఎక్కడెక్కడి నుంచో సత్యసాయి సమాధిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ విస్తరించే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి.

 

తాజాగా రష్యాకు చెందిన ఓ వ్యక్తి పుట్టపర్తికి వచ్చాడు.  ఆ వ్యక్తి తీవ్ర అస్వస్థతతో దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతుడటతో స్థానిక ఆసుపత్రిలోని ఐసొలేషన్ వార్డుకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. దాంతో వెంటనే శాంతి నిలయం సిబ్బంది అలర్ట్ అయ్యారు. శాంతి నిలయంలో ఆంక్షలు విధించారు. సత్యసాయి సమాధిని భక్తులెవరూ తాకవద్దని స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. మరోవైపు పుట్టపర్తిని సందర్శిస్తున్న విదేశీ భక్తులు, పర్యాటకుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటికే భారత దేశంలో 83 మందికి ఈ వైరస్ సోకినట్లు సమాచారం. ఇద్దరు ఈ కరోనా వైరస్ వల్ల మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: