ఏడేళ్ల క్రితం దేశ రాజధానిలో జరిగిన దారుణ ఘటన నిర్భయ కేసులో ఎట్టకేలకు న్యాయం జరిగింది. ఏడేళ్ల నుంచి న్యాయ పోరాటం చేస్తున్న నిర్భయ తల్లితండ్రుల పోరాటానికి ఫలితం దక్కింది. పాటియాలా  హౌస్  కోర్టు నిన్న నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేస్తూ తీర్పునివ్వగా... ఈరోజు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు నిర్భయ దోషులకు ఉరి అమలైంది. అయితే నిర్భయ దోషులకు శిక్ష విధించేందుకు ప్రత్యేకంగా నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చిన... కోర్టులు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేసినప్పటికీ... భారత చట్టాల్లోని లొసుగులు ఉపయోగించుకుంటూ ఇన్నేళ్ల  వరకు కాలయాపన చేస్తూ వచ్చారు నిర్భయ దోషులు. 

 

 

 ఒకరి తర్వాత ఒకరు చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూ.. కోర్టుల  ఉరిశిక్షలు విధించినప్పటికీ కూడా వాయిదా పడేలా చేస్తూ కోర్టుల తీర్పులను అవహేళన చేస్తూ వచ్చారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు తమకు ఉన్న అన్ని న్యాయపరమైన అవకాశాలను ఉపయోగించుకున్నారు నిర్భయ దోషులు . ఇక ఎట్టకేలకు నిర్భయ దోషులకు న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలు అయిపోయాయి. అయినప్పటికీ మరోసారి పిటిషన్ దాఖలు చేశారు నిర్భయ దోషులు . ఇక దీని పై సీరియస్ అయిన పటియాల కోర్టు నిర్భయ దోషులు  వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ ఉరిశిక్ష అమలు చేసింది . ఈరోజు ఉదయం ఐదున్నర గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలంటూ నిన్న పటియాల కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 

 

 

 ఇక దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కర్మాగారం అయినా తీహార్ జైలులో  నేడు నిర్భయ దోషులకు  ఉరిశిక్ష అమలు అయ్యింది. నలుగురు నిర్భయ దోషులు ఉరి కంబానికి ఎక్కారు .  అయితే ఈ రోజు ఉదయం తెల్లవారు జామునుంచే నిర్భయ దోషులకు ఉరి ఎలా సాగింది అంటే... ఈరోజు తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటలకే నిర్భయ దోషులకు నిద్ర లేపారు పోలీస్ అధికారులు. రోజు వారి దినచర్యను ముగిసిన తర్వాత నిర్భయ దోషులకు అల్పాహారం అందించారు.  అనంతరం డాక్టర్లు వారికి వైద్య పరీక్షలు నిర్వహించి... అంతా సవ్యంగా ఉంది అని స్పష్టం చేశారు. ఇక ఒక్కో దోషి  వెంట 12 మంది గార్డులు వెంటరాగా... నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరి కంబం దగ్గరికి నడిపించారు.  న్యాయమూర్తి,  వైద్యులు,  జైలు అధికారుల సమక్షంలో అనుకున్న సమయానికి ఐదున్నర గంటలకు నిర్భయ కేసులో నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: