ఇది ఇప్పటి మాట కాదు.. సరిగ్గా ఎనిమిదేళ్ల కిందటి కథ. కడప జిల్లాలోని తొండూరు, సింహాద్రిపురం, వీరపునాయనిపల్లె, వేంపల్లె, పులివెందుల, వేముల, కమలాపురం మండలాలకు చెందిన రైతుల కన్నీటి వ్యథ. అప్పట్లో రబీలో రైతులు పంటలు సాగుచేశారు. కానీ వర్షాలు లేక చేసిన పంటలు చేతికందకలేదు. రైతుకు పంట పండితేనే గిట్టుబాటు ధర కష్టం. అలాంటిది ఏకంగా పంట పండకపోతే.. గింజ చేతికి రాకపోతే.. అప్పుల ఊబిలో కూరుకుపోవడమేగా. ఇలాంటి కష్ట సమయాల్లోనే ప్రభుత్వాలు కాస్త రైతులను ఆదుకోవాలి.

 

 

ఈ మేరకు అప్పట్లో రైతులు అప్పటి ప్రభుత్వానికి పంటల బీమా కింద క్లెయింలు చెల్లించాలని దరఖాస్తులు పెట్టుకున్నారు. కానీ అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. జగన్ ప్రతిపక్షనేతగా చేసిన పాదయాత్రలో రైతుల కష్టాలు ఆయనకు తెలిశాయి. సీఎం అయితే మీ క్లెయింలు ఇప్పిస్తానంటూ జగన్ భరోసా ఇచ్చారు. ఇప్పుడు సీఎం అయ్యాక ఆ మాట నిలబెట్టుకున్నాడు. అలా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చొరవతో కడప జిల్లా రైతుల నిరీక్షణ ముగిసింది.

 

 

ఎనిమిదేళ్ల కిందటి రబీ పంటల బీమా క్లెయిములకు ఎట్టకేలకు చెల్లింపులు జరిగాయి. 24,641 మంది రైతులకు బీమా కంపెనీ రూ. 119.44 కోట్లు చెల్లించింది. రైతుల ఖాతాలకు కంపెనీ ద్వారా నేరుగా సొమ్ము చెల్లించే కార్యక్రమాన్ని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. సీఎం వైఎస్‌ జగన్‌ బటన్‌ ప్రెస్‌ చేసిన వెంటనే రైతుల అకౌంట్లలో డబ్బు జమ అయ్యింది. ఈ కార్యక్రమం తర్వాత జగన్ ఆ రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.

 

 

కరోనా ప్రభావం ఉన్నా.. తమకు ఇచ్చిన మాట ప్రకాం డబ్బులు ఇవ్వడం ఆనందంగా ఉందని రైతులు అన్నారు. వారితో ఆప్యాయంగా మాట్లాడిన జగన్ అరటి పంట విక్రయాల్లో సమస్యలను ప్రస్తావించారు. వ్యాపారస్తులతో చర్చించి రైతుల సమస్యలను పరిష్క రిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా సంబంధిత పోలీసు అధికారులు కూడా సహకరిస్తున్నారని తెలిపారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: