భారత దేశాన్ని మొత్తం కరోనా  వైరస్ కబలిలిస్తున్న  విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా  వైరస్ మన దరికి చేరకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటే మాస్క్ ధరించడంతో పాటు ఏ పని చేయాలన్నా శానిటైసర్  ఉపయోగించాలి అనే విషయం తెలుసిందే . సబ్బుతో చేతులు కడుక్కోవడం లేదా శానిటైజర్  చేతులను శుభ్రం చేసుకోవడం చేయాలి. ఈ నేపథ్యంలో మాస్క్ లకు శానిటైసర్ లకు  ఒక్కసారిగా గిరాకీ పెరిగిపోయింది. గిరాకీ  పెరగడం కాదు శాని టైర్లకు మాస్క్ లకు కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో కనీసం వంద రూపాయలు పెట్టిన మాస్కు దొరకని పరిస్థితి కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఎన్ని ఫార్మసీలో అడిగినప్పటికీ శానిటరీ దొరకడం లేదు. 

 

 

 అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం మిగిలిన బియ్యం తో శానిటైసర్  తయారు చేసేందుకు నిర్ణయించింది. ఇప్పటికే 80 కోట్ల మంది పేదలకు మూడు నెలల పాటు ఉచితంగా ఆహారధాన్యాల పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే అధికారిక సమాచారం ప్రకారం 58.49 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయి. ఇందులో 80 కోట్ల ప్రజలకు ఇవ్వనున్న ధాన్యాలు 35.97 మిలియన్ టన్నులు. 27.52 మిలియన్ టన్నుల గోధుమలు ఇంకా నిలువవున్నాయి. అంటే నిర్దేశించిన ఆహార ధాన్యాల కంటే  21 మిలియన్ టన్నులు ఎక్కువగా ధాన్యాలు  ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇథనాల్  హ్యాండ్ శానిటైజర్  తయారీ కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ కంపెనీలను   డిస్టిలరీను  ఆశ్రయించినది.  పెట్రోలు కలిపేందుకు ఇథనాల్ ను  షుగర్ ఫ్యాక్టరీలు సరఫరా చేస్తూ ఉంటాయి. 

 

 ఈ క్రమంలోనే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద గోదాములో ధాన్యం  అవసరానికి మించి ఉన్న బియ్యాన్ని ఇథనాల్  గా మార్చి శానిటైసర్  తయారీకి ఉపయోగించాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జీవ ఇంధనాలపై  జాతీయ విధానంలో భాగంగా పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఎందుకంటే ప్రస్తుతం లాక్ డౌన్ లో  దేశవ్యాప్తంగా ఎంతో మంది నిరుపేదలు తిండిలేక అలమటిస్తున్నారు.అలాంటిది  మిగిలి ఉన్న దాన్యాన్ని ఇథనాల్ కోసం  ఉపయోగిస్తారా  అన్నదానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: