ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు భారత్ సహా అన్ని దేశాలు కృషి చేస్తున్నాయి. కరోనాకు మందు కనిపెడితే మాత్రమే వైరస్ విజృంభణ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. గతంలో కరోనాకు హైడ్రాక్సీ క్లిరోక్విన్ బాగా పని చేస్తున్నట్టు వైద్యులు ప్రకటించారు. 
 
తాజాగా మరో మందు కరోనాను కట్టడి చేయడంలో మంచి ఫలితాలను ఇస్తోందని వైద్యులు చెబుతున్నారు. యాంటీ వైరస్ డ్రగ్ రెమ్ డెసివర్ మంచి ఫలితాలను ఇస్తోందని వైద్యులు చెబుతున్నారు. తాజాగా అమెరికా కరోనా చికిత్సకు ఈ మందును వినియోగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఎమర్జెన్సీ మెడిసిన్ గా కరోనా పేషెంట్లకు రెమ్ డెసివిర్ ను ఇవ్వొచ్చని ప్రకటన చేసింది. 
 
వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి యాంటీ వైరల్ ఇంజెక్షన్లను వాడాలని సూచించింది. కరోనాతో పోరాడేవారికి ఈ మందు దివ్యౌషధంలా పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ట్రంప్ ఈ మందు గురించి మాట్లాడుతూ కరోనాపై పోరులో ఇది ఆశాజనక స్థితి అని అన్నారు. అలర్జీ అండ్‌ ఇన్‌ఫెక్చువస్‌ డిసీజెస్‌ సంస్థ కూడా రెమ్ డెసివర్ అద్భుత ఫలితాలను ఇస్తున్నట్టు ప్రకటన చేసింది. 
 
రెమ్ డెసివర్ వినియోగంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని అమెరికా చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనాకు మందును కనిపెట్టేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. ఎబోలా మరణాలను తగ్గించాలనే ఉద్దేశంతో రెమ్ డెసివర్ మందును అందుబాటులోకి తెచ్చారు. కానీ ఎబోలాను నివారించడంలో ఈ మందు పెద్దగా పని చేయలేదు. కరోనా నివారణలో మాత్రం ఈ మందు అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని వారు చెబుతున్నారు. త్వరలో ఇతర దేశాలు సైతం ఈ మందును ఉపయోగించడానికి ఆసక్తి చూపే అవకాశం ఉంది. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: