కువైట్ లో ఉంటున్న భారతీయులకు ఆ దేశ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆ దేశంలో భారతీయులను మన దేశానికి పంపించేందుకు అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ దేశ ప్రభుత్వం భారత్ ఆమోదం కొరకు ఎదురు చూస్తోంది. మోదీ సర్కార్ ఆమోదం తెలిపిన వెంటనే ఆ దేశంలో ఉన్న భారతీయులను తరలించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోవైపు మన దేశం కూడా విదేశాల్లో ఉన్న భారతీయులను మన దేశానికి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రచిస్తోంది. 
 
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 34 లక్షలు దాటింది. వైరస్ కు వ్యాక్సిన్ లేకపోవడంతో ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ పైనే ఆధారపడ్డాయి. ఇప్పటికే అన్ని దేశాలు అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేశాయి. చాలా దేశాల్లో భారతీయులు చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం ఇప్పటికే మన దేశంలో ఉన్న వలస కూలీలను సొంతూళ్లకు పంపించేందుకు చర్యలు చేపట్టింది. 
 
శ్రామిక్ రైళ్ల ద్వారా వలస కూలీలను కేంద్రం సొంతూళ్లకు సిద్ధమవుతోంది. తాజాగా కేంద్రం వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన లక్షలాది మంది ప్రవాస భారతీయులను సొంతూళ్లకు తరలించటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సర్కార్ ఇందుకోసం భారీ కసరత్తులు చేస్తోందని సమాచారం. భారత్ కు చెందిన అన్ని ముఖ్య శాఖలు ఇందులో పాలు పంచుకోనున్నాయని సమాచారం. గతంలోనే భారత్ ఇలాంటి ఆపరేషన్లు నిర్వహించి సక్సెస్ అయింది. 
 
కరోనా మహమ్మారి వల్ల ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి అన్ని రకాల చర్యలు చేపడుతోంది. కేంద్రం ఇందుకోసం రక్షణ విమానాలను సిద్ధం చేస్తోంది. ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు అక్కడ నరకయాతన అనుభవిస్తున్నారు. కేంద్రం కువైట్ లోని భారతీయులను దేశానికి రప్పించేందుకు ఏర్పాటు చేసిందని అతి త్వరలో కువైట్ లోని భారతీయులు భారత్ కు చేరుకోనున్నారని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: