కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ప్రజలకు ఆత్మీయ, ప్రియతమా నేతగా నిలుస్తున్నారు. తాను ఎమ్మెల్యే పదవి లో ఉన్నప్పటికీ... పదవి అహంకారం ఏమాత్రం చూపించకుండా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఏసీ కార్లలో తిరుగుతున్నా తాను ఒక రైతు బిడ్డని అని మర్చిపోకుండా అత్యంత సామాన్యుడిగా ఉంటూ అందరి ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా నియోజకవర్గంలోని ఓ పల్లెటూరికి వెళ్ళిన అతను నులక మంచం పై కూర్చొని ముంజలను చాలా నైపుణ్యంగా కట్ చేయడం అందరిని వావ్ అనిపించింది. వామ్మో ఈ ఎమ్మెల్యే ఏంటి ఇంత స్టైలిష్ గా ముంజలను కోస్తున్నారు? అని ఆ పల్లెటూరి జనాలు అవాక్కయ్యారు అంటే నమ్మండి. 

IHG
రామిరెడ్డి ప్రతాపరెడ్డి ఒక సాధారణ రైతు కుటుంబం లో పుట్టి ఎన్నో కష్టాలను అనుభవించి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. తనకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా... ఎంతో స్వయం కృషి తో ఎమ్మెల్యే అయి పేద పిల్లల కోసం విద్యా సంస్థలను స్థాపించి ప్రతి రైతు బిడ్డ కి స్ఫూర్తిదాయకం గా మారారు. తను ఎంత గొప్ప పదవిని అధిరోహించినా తాను తన పాత జీవితానికి ఏమాత్రం మర్చిపోలేదని స్పష్టమవుతుంది. 

IHG
ఎమ్మెల్యే అంటే ఎన్నో బిజీ పనులు ఉంటాయి. ఆ కార్యకలాపాలన్నిటిని సమర్థవంతంగా మేనేజ్ చేస్తూనే... వీలు చిక్కినప్పుడల్లా మన హోదాలను, రాజసాలను పక్కనబెట్టి ఓ సామాన్యుడిలా ప్రవర్తిస్తుంటారు. స్విమ్మింగ్ పూల్స్ లకు దూరంగా ఉంటూ అందరూ చూస్తుండగానే నడి సంద్రంలో దూకి ఈత కొడుతుంటారు. తాటి చెట్టు ఎక్కి ముంజల ను కోసి... వాటిని పర్ఫెక్ట్ గా కట్ చేసి తన మిత్రులకు అందిస్తుంటారు. కొండంత అధికారం చేతిలో ఉన్నా ఈ కాలంలో ఏ ఎమ్మెల్యే చేయని పనులను తాను చేస్తూ అందరి రాజకీయ నేతలకు రోల్ మోడల్ గా దూసుకెళ్తున్నారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: