ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ హవా నడుస్తోంది. రాజకీయాల్లో ఆయనకు ఎదురే లేకుండాపోయింది. అదే సమయంలో మీడియాలో 90 శాతం అంతా ఆయనకు అనుకూలంగానే నడుస్తోంది. నయానో భయానో ఆయన మీడియాను దారికి తెచ్చుకున్నారు. ఇప్పుడు అగ్రశ్రేణి పత్రికలు, ఛానళ్లు సైతం ఆయనకు వ్యతిరేకంగా ఒక్క ముక్క రాయాలంటేనే వణికిపోతున్న పరిస్థితి ఉంది. 

 

అయితే.. ఓ ఛానల్, ఓ పేపర్ మాత్రం కేసీఆర్ పై ధిక్కార స్వరం వినిపిస్తున్నాయి. అవే వీ6 న్యూస్ ఛానల్, వెలుగు దిన పత్రిక. పారిశ్రామికవేత్త, రాజకీయ నేత, మాజీ ఎంపీ జి. వివేకానంద కు చెందిన ఈ మీడియా ఇప్పుడు కేసీఆర్ సర్కారును అడుగడుగునా నిలదీస్తోంది. 
వీ6 చానల్ మొదటి నుంచి తెలంగాణ గొంతుకగా మంచి పేరు సంపాదించింది. 

 

తెలంగాణ యాస, భాష, కట్టు, బొట్టులను ప్రతిబింబింస్తూ.. అసలైన తెలంగాణ ఛానల్ అనిపించుకుంది. తెలంగాణ బ్రాండ్‌తోనూ జనానికి చేరువైంది. తీన్మార్ వార్తల వంటి వినూత్న కార్యక్రమాలతో తెలంగాణ జనంలో ఇది మాటీ వీ అన్న పేరు తెచ్చుకుంది. అయితే ఇటీవల వివేక్ బీజేపీలో చేరడంతో ఆ మీడియాలో నిలదీసే తత్వం ఇంకా బాగా పెరిగింది. 

 

అయితే తమకు నచ్చని పత్రికలకు యాడ్స్ ఆపేడయం పాలకులు తరచూ చేస్తున్న పనే. కేసీఆర్ కూడా అదే అస్త్రం ప్రయోగించారు. అయితే దీనికి వీ6, వెలుగు దీటుగా సమాధానం చెప్పాయి. ఏకంగా పత్రిక మొదటి పేజీలోనే వీ6, వెలుగు పై సర్కారు కక్ష అంటూ ఎడిటోరియల్ రాసేసింది వెలుగు దిన పత్రిక.  మీరు యాడ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా.. బరాబర్ రాస్తూనే ఉంటామని సవాల్ విసిరింది. తెలంగాణ ప్రజల ఆదరణే పునాదిగా ఎదిగిన v6, వెలుగు.. ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వకపోతే నడవలేని దుస్థితిలో లేవని తేల్చి చెప్పింది. రేటింగ్లను మించిన స్థాయిలో జనం తిరుగులేని అభిమానం, నమ్మకం ఉన్నంత కాలం v6 మనుగడకు ఢోకా లేదని ప్రకటించుకుంది. చూడాలి ఈ సమరం ఎంత వరకూ సాగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: