సాధారణంగా మహిళలు, గృహిణులు కులధ్రువీకరణ పత్రాలు సిద్దంగా ఉంచుకోరు. వాటి అవసరం వారికి పెద్దగా ఉండదు.. బాలికలు, పాఠశాలలకు వెళ్లే వారికి ఈ ఇబ్బంది ఉండదు. కానీ వైఎస్సార్ చేయూత పథకం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజికవర్గాల్లో 45–60 ఏళ్ల మధ్య ఉండే మహిళలకు వర్తిస్తుంది. దీంతో కొందరు కొందరు మహిళలు ఈ పథకం అందుకోలేక పోయారు. ఈ విషయం సీఎం దృష్టికి వచ్చింది. ఆయన ఈ విషయంపై మానవీయ కోణంలో స్పందించారు. బుడగ జంగం, వాల్మీకి, ఏనేటి కొంద్, బెంతొ ఒరియా కులాల వారికి కులధ్రువీకరణ పత్రం అవసరం లేకుండానే వైయస్ఆర్ చేయూత పథకం వర్తింపు జేయాలని జగన్ ఆదేశించారు.
ఈ నాలుగు కులాల వారు వివిధ కారణాలతో కులధ్రువీకరణ పత్రం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కులధ్రువీకరణ పత్రం లేకపోవడం వల్ల ఆయా కులాల్లో పలువురు అర్హత ఉండి కూడా పథకం కింద లబ్ధి పొందలేకపోయారని పలువురు మంత్రులు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సీఎం కార్యాలయ ఆదేశాల మేరకు స్వయం కులధ్రువీకరణ పత్రంతోనే అర్హులకు వైఎస్సార్ చేయూత పథకాన్ని అందించడానికి అధికారులు చర్యలు చేపట్టారు.
సీఎం జగన్ ఆదేశాల మేరకు ఇప్పుడు.. ఈ నాలుగు కులాల వారిలో అర్హులను గుర్తించే ప్రక్రియను మొదలుపెట్టినట్టు సెర్ప్ సీఈవో రాజాబాబు తెలిపారు. త్వరలోనే లబ్దిదారులను గుర్తించి వారికి వైఎస్సార్ చేయూత సొమ్ము అందజేస్తామన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి