సింగూరు ప్రాజెక్టు నిండింది కాబట్టి ఆ నీటితో చెరువులను నింపాలి అని ఆయన చెప్పుకొచ్చారు. ఆర్.ఎం.బి అధికారులను సంప్రదించి వర్షాలకు దెబ్బతిన్న 144 కి.మీ ల రోడ్లకు 130 కోట్లతో మరమ్మతులు చేపట్టాలి అని ఆయన కోరారు. బ్రిడ్జిలు, 42 కాల్వట్లకు 45 కోట్ల రూపాయల అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతాం అని అన్నారు. ఆందోల్, నారాయణ ఖేడ్, జహీరాబాద్ ప్రాంతాల్లో రోడ్లు భారీగా దెబ్బతిన్నాయని ఆయన చెప్పారు. వీటికి వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు.
వ్యవసాయ శాఖకు సంబంధించి జరిగిన పంట నష్టం గురించి రైతులతో మాట్లాడి దెబ్బతిన్న పంట వివరాలు ఆడిగి తెలుసుకోవాలి అని ఆయన ఆదేశించారు. సింగూరు కిందున్న 170 చెరువులో 70 చెరువులు నిండాయి అని అన్నారు. మిగిలిన 100 చెరువులను సింగూరు జలాలతో నింపాలని దికారులను ఆదేశించారు. యాసంగిలో 40 వేల ఎకరాలకు నిరంధిస్తాం అని ఆయన స్పష్టం చేసారు. అందుకు అవసరమైన విధంగా అధికారులు పనిచేసున్నారు అని ఆయన అన్నారు. లోతట్టు ప్రాంతాల్లో సమస్యలను గుర్తించాలి అని ఆయన అధికారులకు సూచించారు. దెబ్బతిన్న ఇళ్లను గుర్తించి వాటికి 24 గంటల్లో నగదు అందించి, నిత్యావసర సరుకులు, అత్యవసర సేవలు అందించాలి అని ఆయన సూచించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి