హైదరాబాద్: రాష్ర్టపతి అభ్యర్థిగా పోటీ పడుతున్న పీఏ సంగ్మా సోమవారం నాడు వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మతో భేటీ అయ్యారు. ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా సంగ్మా కోరారు. అయితే జైలులో ఉన్న జగన్ను కలిసేందుకు సంగ్మా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వారం రోజుల కిందటనే సంగ్మా జైలు అధికారులకు తాను జగన్ను కలుస్తానంటూ టైం తీసుకున్నారు. కానీ, తీరా ఇక్కడికి వచ్చిన తరువాత జగన్ను కలిసే అవకాశం కలగలేదు. దీనితో సంగ్మా అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. .జగన్ను కలవకపోయినా... ఆయన తల్లి, వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, పార్టీకి చెందిన ఇతర సీనియర్ నేతల్ని కలిసి రాష్ర్టపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని సంగ్మా కోరారు. అయితే పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: