ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు కడితే.. వాటిని కూల్చివేసి ప్రభుత్వ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం కూడా టీడీపీ నేతలకు మహాపరాధంగా కనిపిస్తోంది. విశాఖ గీతం వర్సిటీలోని అక్రమ భూముల స్వాధీనం వ్యవహారంపై అధినేత చంద్రబాబు మొదలుకుని గల్లీ లీడర్ వరకూ కుతకుతలాడిపోతున్నారు. ఇక ఓ మాజీ మంత్రి ఈ విషయంలో ఏకంగా అధికారులను మీడియా ముందే బూతులు తిడుతూ మాట్లాడారన్న విషయం చూస్తే.. టీడీపీ నేతల కడుపులు ఎంత రగిలిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు.  

గీతం యూనివర్శిటీ ఆక్రమించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై టిడిపి నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఘాటుగా స్పందించారట. రెవెన్యూ అధికారులపై బూతు పురాణం లంకించుకున్నారట. ‘చదువు చెప్పే విద్యాసంస్థను కూల్చేస్తారా? పడగొట్టిన వాడెవడండీ. బుద్ధుందా ఆ గాడిద కొడుకులకు.. ఆర్డీవో దగ్గరుండి పడగొట్టాడు. ముందు ఆర్‌డీవో, ఆ నాకొ... సస్పెండ్‌ చేయాలి’  అంటూ మండిపడ్డారట. ‘గీతం కాలేజీని ధ్వంసం చేయడమేంటి. అధికారులకు జ్ఞానం లేదా.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. కోర్టు పరిధిలో ఉన్న గీతం కాలేజీ నిర్మాణాలను తొలగించిన ఆర్డీవో, తహసీల్దార్‌.. ఆ నా కొడు.... సస్పెండ్‌ చెయ్యాలి అంటూ అయ్యన్న రెచ్చిపోయినట్టు తెలిసింది.

వైసీపీ నాయకులు మాత్రం ఈ కూల్చివేతలను సమర్థించుకుంటున్నారు. గీతం యూనివర్సిటీ పేదలకు ఏమైనా చదువు చెప్పుతుందా..? ఒక్క సీటుకు రూ.2 లక్షలు తీసుకుంటున్నారు. ఉద్యోగాల భర్తీలో, విద్యార్థులకు సీట్ల కేటాయింపులో కానీ  గీతం యూనివర్సిటీ ఏమైనా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఫాలో అవుతుందా..? బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఫ్రీ ఎడ్యుకేషన్‌ ఇస్తుందా..? గీతం యూనివర్సిటీని కూల్చేశారని రాద్ధాంతం చేసే నాయకులకు సిగ్గుండాలి. 40 ఎకరాల భూమి విలువ రూ.800 కోట్లు..అంటూ వైసీపీ నేతలు బదులిస్తున్నారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం మంచి పనులు చేస్తుందని.. ప్రభుత్వానికి మంచిపేరు రాకూడదని, ఈ ఘటనను కక్షసాధింపుగా చూపించి ప్రభుత్వంపై బురదజల్లాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని.. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కి  ఎవరిపైనా ఎలాంటి వ్యక్తిగతమైన విద్వేషాలు లేవని వివరిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: