సాధారణంగా ఇప్పుడున్న రాజకీయాలలో దాదాపు చాలా మంది ఎమ్మెల్యే లు ఎంపీలు ఎక్కడో ఒక దగ్గర నేరాలతో సంబంధం ఉన్నవారే ఉంటున్నారు. దీనికి ఎన్నో రాష్ట్రాలు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అంతెందుకు రీసెంటుగా సుప్రీమ్ కోర్టులో ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులన్నింటినీ సత్వరమే పరిష్కరించాలని ఆదేశించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే వచ్చే నెల మొదటివారంలో బీహార్లో జరగనున్న ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులలో ఎక్కువ శాతం క్రిమినల్స్ ఉన్నారని ఏడీఆర్ సంస్థ వెల్లడించింది. మరి దీని గురించిన పూర్తి విషయాలు తెలుసుకోవాలంటే కింద ఇచ్చిన ఏపీహెరాల్డ్ ఆర్టికల్ ను చదవండి.

గతంలో బీహార్ రాష్ట్రము అంటే రౌడీ రాజ్యానికి పుట్టినిల్లులా ఉండేది. కానీ ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితులు మారుతున్నాయి. ఈ రాష్ట్రంలో నేర చరిత్ర ఉన్న వారు ఎన్నికలలో పోటీ చేయడం వల్ల వారి ప్రభావం ఎన్నికలకే పరిమితం కావటం లేదు, పాలనపైనా పడుతోంది. తాజాగా బీహార్అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే బయటపడింది. బిహార్ రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 3 న జరుగనున్నాయి. ఇక్కడ పోటీచేస్తున్న అభ్యర్థుల్లో 34శాతం మంది అంటే 1463 మందిపై క్రిమినల్ కేసులు ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఇక్కడ పోటీ చేసే 27 శాతం మంది అభ్యర్థులపై తీవ్రమైన అభియోగాలున్నాయి. అంతేకాకుండా 389 మంది అభ్యర్థులపై నాన్ బెయిలబుల్ కేసులు ఉండడం గమనార్హం. అయితే ఇవి అన్నీ కనుక రుజువైతే కనీసం ఐదేళ్లు వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టే ఇటీవల కొంతమంది సుప్రీమ్ కోర్టులో నేరచరిత్ర లేని వాళ్ళు మాత్రమే ప్రజాప్రతినిధులుగా అర్హులు అని పిటీషన్లు వేయడం జరిగింది. అయితే ఇవి అనీ ఫలించి ఎప్పుడు ఇలాంటి నేరగాళ్లు రాజకీయాలకు దూరం అవుతారో చూడాలి. మరి ప్రజలు ఎవరికీ ఓటేస్తారో...తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: