తెలంగాణా లో టీ ఆర్ ఎస్ పార్టీ ఒకింత బలహీనమై పోయింది అని చెప్పాలి.. ఇటీవలే జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ పార్టీ ఓ మోస్తరు విజయం సాధించగా గతంలోలా ప్రభంజనాన్ని మాత్రం చుపించాలేకపోయింది. బీజేపీ దెబ్బకు దాదాపు 40 సీట్లు గులాబీ పార్టీ కి తగ్గాయి.. ఈ పరిణామంతో టీ ఆర్ ఎస్ పార్టీ బలం తగ్గినట్లు కనిపిస్తుంది. ఇక టీ ఆర్ ఎస్ పార్టీ 55 సీట్లు గెలవాడా అందుకు సగం మహిళా అభ్యర్థులే గెలిచారు.. సిట్టింగ్ అభ్యర్థులు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు.

ప్రస్తుతం ఉన్న పరిణామాలను చూస్తుంటే  టీ ఆర్ ఎస్ పార్టీ కి ఇప్పుడు బ్యాడ్ డేస్ నడుతున్నాయని చెప్పొచ్చు.. పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న స్థానాలు గెలవకపోవడం, దుబ్బాక లో ఓటమి, ఇంకా గ్రేటర్ లో ఆశాజనక ఫలితాలు రాకపోవడం వంటివి చూస్తుంటే టీ ఆర్ ఎస్ కి గతంలో ఎప్పుడు లేని వ్యతిరేక త ప్రజల్లో నెలకొంది అని రుజువు అయ్యింది.. అయితే ఈ వరుస వైఫల్యాలు చూస్తుంటే కేసీఆర్ కి రాబోయే రోజులు ఇంకెలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.. ఇదే సమయంలో బీజేపీ బలపడడం కూడా కేసీఆర్ కి ప్రతికూలించే అంశం.

ఈ నేపథ్యంలో ప్రజలు తమను ఓడిస్తున్నారనే ఆవేదన నేతల్లో స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో వారికి ప్రజలపై కోపం వస్తోంది. తాము ఎంతో చేశామని కానీ వారు గుర్తించడం లేదని ఫీలవుతున్నారు. ఎంతో చేశాం కాబట్టి.. ఆ “ఎంతో” ఆపేస్తే ప్రజలకు తాము చేసిందేమిటో తెలిసి వస్తుందని అనుకుంటున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఇదే మాట చెబుతున్నారు. జనాలకు మంచిచేస్తే మరిచిపోయే అలవాటు ఉందని.. అందుకే మంచి చేయకూడదని ఆయన అంటున్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని సీఎంను కోరాలని ఉందని.. ఆయన చెప్పుకొచ్చారు. 24 గంటల కరెంట్ కాకుండా.. కేవలం 3 గంటల కరెంట్ ఇవ్వాలని కోరుతానని.. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నిలిపివేసి.. ఎన్నికలకు ఏడాది ముందు మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుందని ఆయన చెప్పుకొచ్చారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: