జనసేన అధినేత ఎప్పటిలాగే పార్ట్‌టైమ్ పాలిటిక్స్ చేస్తున్న విషయం తెలిసిందే. సినిమా షూటింగ్‌లు చేసుకుంటూ, అప్పుడప్పుడు రాజకీయాల్లో కనిపిస్తున్నారు. ఇలా పవన్ కెరీర్ కొనసాగుతుండటంతో, ఏపీలో జనసేన కొంచెం కూడా బలపడలేదు. కొత్తగా పార్టీ పెట్టినప్పుడు పవన్ పోటీ చేయకుండా 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు ఇచ్చి అధికారంలోకి రావడానికి కృషి చేసిన విషయం తెలిసిందే. టీడీపీ అధికారంలోకి వచ్చాక పవన్ సినిమాలు చేయకపోయినా, పూర్తి స్థాయిలో రాజకీయం చేయకుండా, పార్టీని బలోపేతం చేయకుండా కాలం గడిపేశారు.

ఇక 2019 ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేదని చెప్పి, కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయి, ఒక సీటు గెలుచుకున్నారు. ఆ పార్టీ తరుపున గెలిచిన రాపాక వరప్రసాద్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అందరికీ తెలిసిందే. అయితే ఎన్నికల్లో ఓడిపోయాక పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇలా పొత్తు సెట్ కావడంతో పవన్ మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యి, బీజేపీకి లీడ్ ఇచ్చేశారు.

దీంతో ఏపీలో జనసేన మరోసారి తోక పార్టీ అనే పేరు తెచ్చుకుంటుంది. ఇలా ఉండటం వల్ల జనసేనకు స్వతహాగా గెలిచే ఛాన్స్ లేకుండా పోయింది. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసినా, జనసేనకు పెద్దగా ఒరిగేదేమి లేదని తెలుస్తోంది. ఈ రెండు పార్టీలు కలిసి ఓ ఐదు సీట్లు గెలవడం గొప్పే అంటున్నారు. పైగా వీరు ఓట్లు చీల్చేసి, మళ్ళీ వైసీపీకి లబ్ది చేకూరుస్తారని టీడీపీ శ్రేణులు గోల పెడుతున్నాయి. చివరికి వీరు టీడీపేకే బొక్క పెడతారు అంటున్నారు.

అలా కాకుండా పవన్‌ తమతో కలిసి రావాలని, కొందరు టీడీపీ నాయకులు కోరుకుంటున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో జనసేనకు 50 సీట్లు వరకు ఇస్తే పొత్తులో కనీసం 25 సీట్లు అయిన గెలుస్తుందని చెబుతున్నారు. అప్పుడు టీడీపీ ఓ 70 సీట్లు గెలుచుకున్న అధికారంలోకి రావొచ్చని విశ్లేషిస్తున్నారు. పవన్ ఈ బంపర్ ఆఫర్ వదులుకుంటే జనసేన ఎదగడం కష్టమని మాట్లాడుతున్నారు. మరి చూడాలి నెక్స్ట్ ఎన్నికల్లో రాజకీయ సమీకరణలు ఎలా మారుతాయో.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: