మక్కల్ నీది మయ్యం రాజకీయ పార్టీ అధినేత క‌మ‌ల్‌హాస‌న్ పోరాటం ఫ‌లించింది.  తమిళనాట కమల్ హాసన్ ఏర్పాటు చేసిన మక్కల్ నీది మయ్యం రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఊరట కలిగించే నిర్ణయాన్ని ప్రకటించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆయన పార్టీకి టార్చ్‌లైట్‌ గుర్తునే కేటాయించింది. కొద్దిరోజుల క్రితం  ఎన్నికల సంఘం టార్చ్‌లైట్ గుర్తును తమిళనాడులోని ఎంజీఆర్ మక్కల్ కచ్చి అనే రాజకీయ సంస్థతో పాటు పుదుచ్చేరిలోని ఎంఎన్‌ఎంకు కూడా కేటాయించింది. దీంతో కమల్ కమల్ హాసన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. టార్చ్‌లైట్ గుర్తును తమకే కేటాయించేలా ఈసీని ఆదేశించాలని విజ్ఞప్తి చేయగా.. అదే సమయంలో ఎంజీఆర్ మక్కల్ కచ్చి పార్టీ అధినేత విశ్వనాథన్ ఈసీకి లేఖ రాశారు. తమకు ఎంజీఆర్ విగ్రహం, ఆయనకు దగ్గరి సంబంధం ఉండేలా మరేదైనా గుర్తును కేటాయించాలని కోరడంతో ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.  కేంద్ర ఎన్నికల సంఘం ఊరట కలిగించే నిర్ణయాన్ని ప్రకటించింది.


ఈ విషయాన్ని స్వయంగా కమల్ హాసన్ ప్రకటించారు. అణగారిన వర్గాల జీవన ప్రమాణాల మెరుగు కోసం పోరాటం చేసిన మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ పుట్టిన రోజు నాడు తమకు ఈ గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘానికి, ఇందుకు సహకరించిన అందరికీ కమల్ కృతజ్ఞతలు తెలిపారు. వాస్త‌వానికి  2019 లోక్‌సభ ఎన్నికల్లో కమల్ పార్టీ ఈ గుర్తుపైనే పోటీ చేసింది.  వాస్త‌వానికి గత పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం టార్చ్‌లైట్‌ గుర్తును కేటాయించింది.
దీంతో కమల్‌హాసన్‌, పార్టీ నేతలు, కార్యకర్తలు పార్లమెంట్‌ ఎన్నికల్లో  టార్చ్‌లైట్లు  చేత పట్టుకుని తీవ్ర ప్రచారం సాగించారు. దీంతో మక్కల్‌ నీది మయ్యం పార్టీ గుర్తు టార్చ్‌లైట్‌ అని ప్రజల మదిలో సుస్థిరంగా నాటుకుంది.మొత్తానికి క‌మ‌ల్‌హాస‌న్ అనుకున్న‌ది సాధించుకున్నారు. ఇక ఎన్నిక‌ల బ‌రిలోకి దూకి మ‌రింత‌గా దూసుకెళ్లాల‌ని పార్టీ శ్రేణులు కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: