అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ దాడులతో ఆంధ్ర రాష్ట్రం మొత్తం అట్టుడికిపోయింది. ఇలాంటి సమయంలో ఈ దాడులన్నీ తానే చేశానంటూ పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి తెరమీదకు రావడం పెద్ద దుమారమే రేపుతోంది. రాష్ట్రంలోని వందలాది ఆలయాలపై నేనే దాడులు చేశానని, దేవతల విగ్రహాల తలలను తన చేతులతో నరికివేశాననని, పలు విగ్రహాలను ధ్వంసం చేశానని, తన మనుషులతో కూడా అనేక చోట్ల ఇలాంటి దాడులు చేయించానని ప్రవీణ్ చెప్పడం ప్రస్తుతం రాష్ట్రంలోని హిందువులను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది.

11వ తేదీన అమెరికాలోని ఓ క్రైస్తవ విరాళాలు ఇచ్చే దాతతో కూడా ప్రవీణ్ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. ఆన్‌లైన్‌‌ వీడియో కాల్‌లో మాట్లాడుతూ, దేవుళ్ల విగ్రహాలు ఫేక్‌. నా అసోసియేషన్‌లో 3,642 మంది ఫాస్టర్లు ఉన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 699 హిందూ గ్రామాలను క్రైస్తవ గ్రామాలుగా మార్చివేశాము. ఇంకా మరిన్ని గ్రామాలను ఇలాగే చేస్తాం’ అంటూ ప్రవీణ్ చెప్పాడు. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడు చెందిన ప్రవీణ్ చక్రవర్తి చాలా రోజుల నుంచి హిందూ మతంపై దూషణలు చేస్తూ వస్తున్నాడు. దీనికోసం గాసిప్ అనే ఓ యూట్యూబ్ చానల్‌ను కూడా నడుపుతున్నాడు.

ఈ నేపథ్యంలో గుంటూరుకు చెందిన సింగం వెంకట శ్రీలక్ష్మీనారాయణ చేసిన ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో కదలిన పోలీసులు ప్రవీణ్ చక్రవర్తిపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టారనే కారణంతో అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ సమయంలో చక్రవర్తి బౌన్సర్లు సీఐడీ పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ప్రవీణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

క్రీస్తు విలేజ్‌ పేరుతో యూట్యూబ్‌లో ప్రవీణ్ విడుదల చేస్తున్న ప్రసంగాల గురించి ప్రశ్నిస్తున్నారు. త్వరలో ఆయన విద్యాసంస్థలపై కూడా దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది. చక్రవర్తిని 3 రోజుల క్రితం అరెస్ట్‌ చేశామని, ఇప్పటికే అతడిపై తూర్పుగోదావని జిల్లాలో 4 కేసులు నమోదై ఉన్నాయని సీబీఐ అధికారులు చెప్పారు. చక్రవర్తిపై సైబర్‌ క్రైమ్‌ స్టేషన్‌, సీఐడీ విభాగంలో సైబర్‌ బుల్లిషీట్‌ తెరిచామన్నారు. చక్రవర్తిని అరెస్ట్‌ చేసిన తరువాత కోర్టులో హాజరు పరిచామని సీఐడీ అదనపు డీజీ సునీల్‌ కుమార్‌ తెలిపారు.

చక్రవర్తి కుటుంబం సాధారణ కుటుంబమే. చక్రవర్తి తల్లి జగ్గంపేటలో సాధారణ వార్డెన్‌. తండ్రి మెక్లారిన్‌ హైస్కూల్‌లో పీఈటీ. చక్రవర్తి బీదరికంలో పుట్టి అనతికాలంలోనే రూ.కోట్లకు పడగలెత్తాడు. ఆయనకుఎటువంటి చర్చి లేదు. పాస్టర్ల సంఘంలో సభ్యత్వమూ లేదు. ఆయన ఆస్తి దాదాపు రూ.1,000 కోట్లు ఉంటుందని అంచనా. విద్యాసంస్థల ముసుగులోనూ ఆయన అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. చక్రవర్తి బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్‌ చేసి విదేశీ నిధులపై విచారణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

ఇదిలా ఉంటే  తనవద్ద పనిచేసే ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన చక్రవర్తి ఆమెను లోబర్చుకుని వదిలివేయడంతో బాధితురాలు అందోళనకు దిగింది. దీనిపై సర్పవరం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. తన రక్షణకు ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. 50మందికి పైగా బాడీగార్డులకు ఒక్కొక్కరికి నెలకు రూ.15-20వేల వరకూ చెల్లిస్తున్నట్టు సమాచారం. ఈయనకు ఏకంగా 16 కార్లు కూడా ఉన్నాయట. కాకినాడ రూరల్‌ నియోజకవర్గానికి చెందిన ఓ మంత్రితోనూ, కాకినాడ, పెద్దాపురం కీలక నేతలతోనూ ప్రవీణ్‌కు  సంబంధాలున్నాయని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: