ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జర్మన్ షెపర్డ్ డాగ్ సాడీని పెంచిన యజమానులు ఆ ప్రాంతం నుంచి వెళ్లేపోయే ముందు దానిని ఓక్లాండ్‌లోని జంతు సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. దీంతో ఆ శునకం ఒంటరై చాలా దిగులుగా ఉండేంది. అయితే బ్రియాన్ మైయర్స్ అనే వ్యక్తి దానిని దత్తత తీసుకున్నారు. సాడీని తన ఇంటికి తీసుకొచ్చి దాని బాగోగులు చూడసాగారు.
ఇక గత వారం మైయర్స్ ఒక్కరే ఇంట్లో ఉండగా రాత్రివేళ గుండెపోటుకు గురయ్యారు. బెడ్ నుంచి లేచి బాత్‌రూమ్‌కు వెళ్లబోయిన ఆయన కింద పడిపోయారు. గమనించిన సాడీ వెంటనే ఆయన వద్దకు వచ్చి సపర్యలు చేసింది. మైయర్స్ స్పృహ తప్పిపోకుండా తన నాలుకతో ముఖం అంతా నాకింది. ఆయన చొక్కాను పళ్లతో పట్టి పక్కకు తిరిగేలా చేసింది. చివరకు మొబైల్ ఉన్న చోటు వరకు ఆయనను లాగింది. దీంతో మైయర్స్ అతికష్టం మీద తన మొబైల్ నుంచి ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేయడంతో ఆయన ప్రాణాలు దక్కాయి.
ఇక అతడు కోలుకున్న అనంతరం తనకు పునర్జన్మ ఇచ్చిన సాడీ పట్ల తన కృతజ్ఞతను మైయర్స్ వ్యక్తం చేశారు. తనను కాపాడటంలో అది ప్రదర్శించిన తెలివితేటలను ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. దీంతో సాడీకి నెటిజన్ల ప్రశంసలు కూడా దక్కాయి. ఇలాంటి శునకం తమకు కావాలని పలువురు ఆకాంక్షించారు. గుండెపోటుకు గురైన యజమాని ప్రాణాలు కాపాడిన సాడీ తెలివితేటలకు ఆశ్చర్యపోయారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి