లక్షలాది మంది కరవు పీడిత రైతులకు వరప్రసాదినిగా భావించిన హంద్రీ-నీవా సుజల ప్రాజెక్టుకు నిధుల కొరత ఏర్పడింది. గత రెండెళ్లుగా ఈ ప్రాజెక్టుకు అరకొర నిధులే కేటాయించారు. తాజాగా ఈ బడ్జెట్లో రూ.1,637 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం కేవలం రూ.695 కోట్లు మాత్రమే కేటాయించింది. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, జిల్లాల్లో జరుగుతున్న రెండు దశల పనులకు ఈ నిధుల ఇచ్చారు. తొలిధశ పనులు పూర్తి కావచ్చాయి. రెండొవ దశ పనులు 2013 జూన్ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. తాజాగా చేసిన అరకొర కేటాయింపులతో గడువులోగా పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడంలేదు. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఇప్పట్టో ఈ పనులు పూర్తయ్యే అవకాశంలేదని ఇరిగేషన్ శాఖ నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: