కొంత మంది కార్యకర్తలు సొంత పెత్తనాలు సోషల్ మీడియాలో ఎక్కువగా చేయడం కూడా జరుగుతుంది. దీని కారణంగా పార్టీ ఇబ్బంది పడుతుందనే ఆవేదన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఉన్న కొంత మంది మహిళా కార్యకర్తలు కూడా అనవసర విషయాల్లో తలదూర్చడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ప్రధానంగా ఇబ్బంది పెడుతున్నది. అయితే ఈ అంశాల్లో పార్టీ అధిష్టానం కూడా కాస్త సీరియస్ గా దృష్టి పెట్టిందని సమాచారం. కొంతమంది సోషల్ మీడియాలో నాయకులు కొన్ని వర్గాలను ఏర్పాటు చేసుకుని సోషల్ మీడియాలో వర్గ విభేదాలను ప్రోత్సహిస్తున్నారు అనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి.
తమకు అనుకూలంగా ఉండే వారికి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం లేని వారిని పక్కన పెట్టడం వంటివి జరుగుతున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువగా జరగటంతో పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉందని సమాచారం. దీని కారణంగా కొంత మంది కార్యకర్తలు పార్టీకి దూరం జరుగుతున్నారు అనే భావన ఉంది. వాట్సాప్ తో పాటుగా ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాలను వాడుకొనే విషయంలో తెలుగుదేశం పార్టీ చాలా వరకు ఫెయిల్ అవుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొంతమంది నేతలు ఈ విషయంలో వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇటువంటివి సున్నితంగా ఉంటాయి కాబట్టి పార్టీ అధిష్టానం కూడా సీరియస్ గా తీసుకుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి