ఎన్నికలు వస్తే చాలు నాయకులకు ప్రజలు పదే పదే గుర్తుకు వస్తారు. ఎందుకంటే తమ భవిష్యత్ వారి చేతిలో ఉంటుంది.. తమిళనాడు లో రాజకీయ నేతలు ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కసి తో ఉన్నారు. చిన్నా, పెద్ద అనే బేధం లేకుండా ప్రతి ఒక్కరూ ప్రచారంలో పాల్గొంటున్నారు.డీఎంకే పార్టీ నేతలు రొడ్లెక్కారు. అంతేకాదు హిందువులను ఆకర్షించేలా ప్రకటనలను చేస్తున్నారు.హిందూ ఓటర్లను ఆకట్టుకునేలా ప్రకటనలు చేస్తోంది. రాష్ట్రం లో మూతపడ్డ ఆలయాలను తెరుస్తామని హామీలు ఇస్తోంది. పార్టీ అధినేత స్టాలిన్‌.. తాను హిందూ వ్యతిరేకిని కాదని ప్రచారంలో తరచూ పేర్కొంటున్నారు.


హిందువులను తమ వైపునకు తిప్పుకొనేందుకు డీఎంకే అనుసరిస్తున్న ఈ వ్యూహం తమిళ రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.రాష్ట్రంలో పదేళ్లుగా ఆ పార్టీ అధికారానికి దూరంగా ఉంది. ఇప్పుడూ ఓడిపోతే.. తమ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందన్న ఆందోళన పార్టీ నేతల్లో నెలకొంది. దీంతో అన్ని వర్గాల ఓటర్లనూ ఆకర్షించేందుకు అధినేత స్టాలిన్‌ పక్కా ప్రణాళికలతో వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే హిందువులను బుజ్జగించే లా ఆయన మాటలు ఉన్నాయి.ప్రచారంలో ఆయన ప్రసంగిస్తూ.. హిందుత్వానికి డీఎంకే వ్యతిరేకం కాదు. అందరి ఆచార వ్యవహారాలను మేం గౌరవిస్తాం'' అని పేర్కొన్నారు.

 
ఎప్పుడూ హిందూ మతానికి వ్యతిరేకిని కాను. నా భర్య ఆలయాని కి వెళ్లకుండా నేను ఎన్నడూ అడ్డుకోలేదు అని వ్యాఖ్యానించారు. మరో వైపు స్టాలిన్ భార్య దుర్గ పలు ఆలయాల ను సందర్శిస్తుండటం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 7న ఆమె తిరుచ్చి జిల్లా సమయపురం లోని మారియమ్మ గుడిని సందర్శించారు. తిరునెల్వేలి జిల్లా వానుమాలై లోని పెరుమాళ్‌, తెన్‌కాశి లో నరసింహస్వామి, పళనిలో సుబ్రహ్మణస్వామి, తిరువణ్ణామలై లో అరుణాచలేశ్వరుడి  ఆలయాల ను సందర్శించుకోవడం విశేషం.. అన్నీ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరి ప్రజలు ఏ పార్టీకి అనుకూలంగా సీటును ఎక్కిస్తారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: