చావు వరకు వచ్చిందంటే ఎవరైనా భయపడతారు.. అందరినీ వదిలి వెళ్లిపోతున్నా అనే ఆందోళనలో ఉంటారు.. అంతెందుకు ఎవరికైనా చావు అనేది గుండెల్లో భయం పుట్టిస్తుంది. అప్పుడు ఏం చేస్తారు తనతో సన్నిహితంగా ఉన్న వారిని కలుసుకోవాలని.. వారిని చూడాలని.. కుటుంబ సభ్యులతో ఉన్న ఆప్యాయతలను గుర్తు చేసుకుంటారు. అది ఒకప్పటి మాట.. కానీ ఇప్పుడు అలాంటివి లేవని చెప్పాలి.. ప్రస్తుతం సంబంధ బాంధవ్యాలు దూరమవుతున్నాయి.. ప్రస్తుతం అలాంటి సెంటిమెంట్ కు పోతే మనం పోవడం ఖాయమని కొందరు అంటున్నారు.


కరోనా మహమ్మారి వల్ల ఉన్న కొద్దీ పాటి బంధాలు కూడా కనుమరుగయ్యాయి.. కరోనా వచ్చిందంటే వ్యాధి ఉన్న వ్యక్తి తో పాటుగా వారి కుటుంబ సభ్యులను కూడా ఎవరు చూడరు.. కరోనా సోకిన వ్యక్తి మరణించిన కూడా ఎవరూ పరామర్శించారు. ఆఖరికి కుటుంబ సభ్యులు కూడా.. అలా తయారైంది ఇప్పుడు పరిస్థితులు.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కరోనా సోకిన వ్యక్తి చేసిన పనికి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. చావు బతుకుల్లో కూడా అతని బుద్ది మార్చుకోలేదు.. అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.


వివరాల్లోకి వెళితే.. కరోనా రోగులు ఆసుపత్రి బెడ్ల మీద ఆక్సీజన్ అందక ప్రాణాలతో కొట్టిమిట్టాడుతూ కనిపిస్తున్న పరిస్థితి. తాజాగా ఓ వ్యక్తీ మొత్తం బాడీకి మొత్తం ఆక్సీజన్ పైపులు బిగించినా సరే చేతిలో తంబాకు నలుచుకుంటూ వైద్యం తీసుకుంటున్నాడు. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఆ సదరు వ్యక్తిపై మండి పడుతున్నారు.ఆసుపత్రి బెడ్ ఆ పనేంటి నాయనా అని సెటైర్ లు వేస్తున్న పరిస్థితి ఉంది.ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో నెటిజన్ల సెటైరికల్  కామెంట్ల తో వైరల్ అవుతుంది.. మరి అతను బ్రతి ఉన్నాడో లేదో అన్న విషయం మాత్రం తెలియలేదు.. కరోనా ప్రభావం రోజు రోజుకు విజృంభిస్తోంది.. ఈ నేపథ్యంలో స్వీయ నిబంధనలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: