మరి కొన్ని గంటల్లో ఆ పెళ్ళి మండపంలో తప్పేట్లు తాళాలతో పెళ్ళి భాజాలు మోగనునున్నాయి. ఇద్దరు వధు వరులు కూడా పెళ్ళి అనే ఒక సాంప్రదాయ బంధంతో ఒక్కటి అవ్వబోతున్నారు. ఇంతలో ఒక అనుకోని సంఘటన. పెళ్లి మండపంలో కూర్చున్న పెళ్ళి కూతురు చెవిలో ఆమె బంధువులు ఏమి చెప్పారో తెలియదు. వెంటనే ఆ వధువు బంధువులు చెప్పిన మాటలు విని పెళ్ళి మండపం నుంచి లేచి ఆనందంతో గెంతులు వేస్తూ అక్కడ నుండి పరుగులు పెట్టి వెళ్లిపోయింది. అసలు ఆ పెళ్లి కూతురు చెవిలో బంధువులు ఏమి చెప్పారు..?ఆ వధువు లేచి ఆనందంతో ఎక్కడకి పరుగులు పెట్టింది అనే కదా మీ సందేహం.
అయితే వధువు అలా ఆనందంగా పరుగులు పెట్టడానికి ఒక బలమైన కారణం ఉంది అండి. అది తెలిస్తే మీరు కూడా ఆనంద పడతారు.మరి ఈ ఘటన ఎక్కడ జరిగింది.. ఏంటి అనే విషయాలు తెలుసుకుందామా. ! ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లోని మిలాక్ బ్లాక్‌లోని ముహమ్మద్‌పూర్‌లో జరిగింది. ఇక్కడ ఇటీవల పంచాయతీ (బీడీసీ) ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలలో జదీద్ గ్రామానికి చెందిన పూనమ్ శర్మ అనే యువతీ కూడా ఎన్నికల బరిలో పోటీ చేసింది. అక్కడ ఉన్న 135 వార్డు నుంచి ఆమె ఎన్నికల బరిలోకి దిగింది.ఎలక్షన్స్ ముగిసాయి. అయితే కౌంటింగ్ రోజునే ఆమె పెళ్లి జరగడం విశేషం అని చెప్పాలి.
ఆ రోజునే ఓట్ల లెక్కింపు కూడా జరిగింది.ఈ సందర్భంగా అక్కడ ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా జరుగుతున్నట్లు బంధువులు పెళ్ళి మండపంలో ఉన్న వధువుతో చెప్పడం జరిగింది. ఇంకేముంది వధువు ఆనందానికి అవధులు లేవు.వెంటనే లేచి పెళ్లి మధ్యలోనే కౌంటింగ్ జరిగే కేంద్రానికి చేరుకుంది.ఆ వధువు ఎట్టకేలకు ఆమె తన ప్రత్యర్థి మీద 31 ఓట్ల తేడాతో విజయం సాధించింది.ఇంకేముంది పెళ్ళి కూతురు ఫుల్ ఖుష్ అయిపొయింది. నేరుగా కౌంటింగ్ కేంద్రం నుంచి ఊరేగింపుతో పెళ్లి మండపానికి చేరుకుని వరుడితో తాళి కట్టించుకుంది.. నిజంగా అదృష్టం అంటే పూనమ్ శర్మదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు కదా.. !!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి