దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొన్ని రాష్ట్రాలలో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారిపోతుంది. కరోనా వైరస్ కు హాట్ స్పాట్ గా మారిపోతున్నాయి కొన్ని రాష్ట్రాలు. ఇటీవలికాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోయిందన్న విషయం తెలిసిందే.  ప్రజలందరూ ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ పంజా విసురుతోంది. అయితే రెండవ రకం కరోనా వైరస్  ఎంతగానో ప్రభావం చూపుతుంది


 వేగంగా వైరస్ పంజా విసరడమే కాదు ఎంతో మందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యతో బాధ పడుతున్న నేపథ్యంలో చాలా మంది ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. దీంతో ఆస్పత్రిలో ప్రతి ఒక్క  వైరస్ రోగికి ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి రావడంతో ఇక ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది ఇలాంటి నేపథ్యంలో ఎంతో మంది ముందుకు వచ్చి ఇక ఆక్సిజన్ కొరతను తీర్చి ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టేందుకు మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కేవలం సామాన్యులు మాత్రమే కాదు పలు సంస్థలు సైతం ముందుకు వస్తున్నాయి. ఇటీవలే ప్రముఖ దేవాలయమైన టిటిడి దేవస్థానం బోర్డు కరోనా రోగులకు పునర్జన్మను ఇచ్చేందుకు సిద్ధమైంది.



 ఇటీవలే ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు టీటీడీ అధికారులు. ఆక్సిజన్ లేక ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కరోనా వైరస్ రోగుల కోసం జర్మన్ షెడ్లను ఏర్పాటు చేశారు. ఇక ఈ షెడ్లలో ఆక్సిజన్ నీరు వాటర్ సహా మందులు ఇంజెక్షన్లు అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. ఇలా నిన్నటి వరకు అక్సిజన్ కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న కరోనా రోగుల అందరూ కూడా ఇక ఇప్పుడు టిటిడి బోర్డు ఏర్పాటు చేసిన జర్మన్ షెడ్ల లోకి వెళ్లి చికిత్స పొందుతున్నారు.  కరోనా వైరస్ రోగులు పెరిగిన కొద్దీ సరికొత్త షెడ్లు నిర్మించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాము అంటూ టీటీడీ బోర్డు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: