కంచుకోటలాంటి కృష్ణా జిల్లాలో సైతం తెలుగుదేశం పార్టీ తీవ్ర కష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే. మామూలుగా కృష్ణా జిల్లాలో టీడీపీ బలంగా ఉండేది. కానీ గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి కృష్ణా జిల్లాలో కూడా టీడీపీ వీక్ అయిపోయింది. ఎన్నికలై రెండేళ్ళు అయినా సరే పార్టీ బలోపేతం కాలేదు. ఇప్పటికీ మెజారిటీ నియోజకవర్గాల్లో వైసీపీ హవా నడుస్తోంది.


అయితే కొన్నిచోట్ల టీడీపీ పర్వాలేదనిపిస్తుంది. టీడీపీ నేతలు వైసీపీకి బాగానే పోటీ ఇస్తున్నారు. కానీ కొన్నిచోట్ల టీడీపీ పరిస్తితి మరీ ఘోరంగా ఉంది. అసలు నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఆ నియోజకవర్గాల్లో టీడీపీకి గెలిచే ఛాన్స్ కనబడటం లేదు. అలా టీడీపీ పరిస్తితి దారుణంగా నియోజకవర్గాల్లో నూజివీడు, తిరువూరు నియోజకవర్గాలు ముందు వరుసలో ఉంటాయి.


గత నాలుగు ఎన్నికల నుంచి తిరువూరులో టీడీపీ జెండా ఎగరడం లేదు. వరుసగా మూడుసార్లు టీడీపీ తరుపున నల్లగట్ల స్వామిదాసు పోటీ చేసి ఓడిపోతే, గత ఎన్నికల్లో మాజీ మంత్రి జవహర్ పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక జవహర్ మళ్ళీ తన సొంత నియోజకవర్గం కొవ్వూరు వెళ్ళిపోయారు. అలా అని తిరువూరులో స్వామిదాసు యాక్టివ్ కాలేదు. ఆయన పార్టీలో పెద్దగా కనిపించడం లేదు. తిరువూరులో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేయడం లేదు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే రక్షణనిధి దూసుకెళుతున్నారు. ఆయనకు చెక్ పెట్టడం స్వామిదాసుకు అయ్యే పని కాదని తెలుస్తోంది. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా తిరువూరులో టీడీపీ జెండా ఎగరడం కష్టమే.


అటు నూజివీడులో టీడీపీ పరిస్తితి ఘోరంగా ఉంది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పోటీ చేసి ఓడిపోతున్నారు. ఈయన కూడా నియోజకవర్గంలో యాక్టివ్‌గా లేరు. పైగా నూజివీడు టీడీపీలో గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపు తగాదాలు వల్లే రెండుసార్లు టీడీపీ ఓడిపోయింది. ఇవి ఇలాగే కొనసాగితే నెక్స్ట్ ఎన్నికల్లో సైతం నూజివీడులో టీడీపీకి కష్టమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: