మరి ఇక్కడ ఎకరం ఎంత రేటు పలుకుతుందో తెలుసా.. గతంలో ఓసారి కోకాపేట చుట్టుపక్కల భూములు వేలం వేసినపుడు ఎకరా ధర రూ.40 కోట్ల వరకూ పలికింది. ఈసారి రూ.45 కోట్ల నుంచి రూ.50 కోట్ల మధ్య వరకూ రేటు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ భూముల వేలంలో రెండు మూడు అంతర్జాతీయ సంస్థలు వేలంలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేలం ప్రక్రియను పూర్తి చేస్తారు. ఎంత తక్కవ ధర పలికినా ప్రభుత్వానికి రూ.2500 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇక ఈ 50 ఎకరాల వెంచర్ వివరాల్లోకి వెళ్తే.. ఈ మొత్తం భూమిని ఎనిమిది ప్లాట్లుగా విభజించారు. ఒక్కో ఎకరం కనీసం ధర రూ.25 కోట్లుగా నిర్ధారించారు. ఈ వెంచర్ అవుటర్ రింగ్ రోడ్ పక్కనే ఉంది. ప్రస్తుతం ఈ వెంచర్‌లోకి అవుటర్ నుంచి నేరుగా రావడానికి మాత్రం వీలులేదు. ఆర్థిక జిల్లా నుంచి కోకాపేటకు రావాలంటే ట్రాఫిక్ సమస్యలు వస్తున్తనాయి. అందుకే ఈ సమస్య లేకుండా ప్రత్యేకంగా ట్రంపెట్ నిర్మిస్తున్నారు. దీంతో ఎయిర్‌పోర్టు వైపు నుంచి అవుటర్ మీదుగా నేరుగా ఈ లేఅవుట్‌లోకి రావచ్చు. ఈ ట్రంపెట్ నిర్మాణంతో ఈ వెంచర్‌కు మంచి డిమాండ్ వచ్చింది.
వేలందారులను ఆకర్షించేందుకు ఈ నియోపోలిస్ వెంచర్ ను అన్ని సౌకర్యాలతో తీర్చి దిద్దారు. వెంచర్ లోపల వంద అడుగుల రోడ్లు వేశారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఈ వెంచర్‌లోకి వచ్చేందుకు ప్రత్యేకంగా ట్రంపెట్ నిర్మాణాన్ని కూడా ప్రారంభించారు. కోకా పేట భూములతోపాటు ఖానామెట్‌లోని 15 ఎకరాలు ఎల్లుండి వేలం వేస్తారు. ఇక్కడ వెంచర్‌కు ప్రభుత్వం గోల్డెన్ మైల్ అని పేరు పెట్టింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి