ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికంగా ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఫై ఇటీవల కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా మొన్నటి వరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకు మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.  దీంతో ఏపీ వాసులందరికీ ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి.  విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తాము అంటూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం ఇక ఏపీ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడమే అంటూ అటు ఏపీ అధికార ప్రతిపక్ష పార్టీల నేతలందరూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అనుమతించబోమని అంటూ ఇప్పటికే ఎంతోమంది నిరసనలు ఆందోళనలు కూడా చేపడుతున్నారు.



 స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తాం అంటూ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ప్రస్తుతం ఎంతో మంది నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు అటు ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ అంశంపై స్పందిస్తూ అటు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు అధికార పార్టీ సైతం కేంద్రం నిర్ణయాన్ని తీవ్రస్థాయిలో తప్పు బడుతుంది. అయితే ఇటీవలే ఈ అంశంపై వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తామూ అంటూ నిర్ణయం తీసుకోవడాన్ని తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు.



 స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు ఎంతటి పోరాటం చేయడానికైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్  నష్టాల్లో కొనసాగుతుందని అందుకే ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమయ్యామూ అంటూ కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే స్టీల్ ప్లాంట్ను లాభాల్లోకి తీసుకు రావాలి అంటే ఇక విశాఖ స్టీల్ కర్మాగారానికి ఉన్న రుణాలని ఈక్విటీ కింద  మార్చి రుణభారం వడ్డీ భారాన్ని తగ్గించాలని అలా చేస్తే ప్రయోజనం ఉంటుంది అంటూ కేంద్రానికి సూచించారు విజయసాయిరెడ్డి. ఇక ముడిసరుకు కోసం క్యాపిటివ్ మైన్స్ కేటాయించాలి అంటూ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vsr