ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు హుజురాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన ఈటెల కమలం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హుజురాబాద్ పాదయాత్ర లో బిజీగా ఉన్నారు. పాదయాత్రలో భాగంగా ఈరోజు ఈట‌ల రాజేందర్ కొన్ని మండ‌లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ కేసీఆర్ కు సవాల్ విసిరారు... ప్ర‌పంచంలో మనిషికి వెలకట్టే రాష్ట్రం తెలంగాణ అని నాయకుడు కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. బస్సు ఎక్కించి సిద్దిపేట తీసుకుపోతున్నారని... వెలకట్టి పంపుతున్నారు అని ఈట‌ల వ్యాఖ్యానించారు. 19 ఏళ్ల గా తాను కాకుండా ఇంకా ఎవరైనా వచ్చారా అంటూ ప్రశ్నించారు. భయంతో ముఖ్యమంత్రి ఫోటో గోడ‌ల మీద ఉంది... కానీ తన ఫోటో ప్రజల గుండెల్లో ఉందని ఈట‌ల వ్యాఖ్యానించారు.

అతి తక్కువ కాలంలో ఎక్కువ ఎన్నికల్లో పోటీ చేశాన‌ని ఈట‌ల గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ మరికొందరు నాయకులు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా తనపై విమర్శలు చేసిన మోత్కుపల్లి న‌ర్సింహులు పై ఈట‌ల‌ మండిపడ్డారు. మోత్కుపల్లి న‌ర్సింహులు బిజెపికి రాజీనామా చేసి కేసీఆర్ పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ద‌ళిత బంధు పథకం ఎంతో బాగుందని దళితుల అభివృద్ధికి ఈ పథకం ఎంతో కృషి చేస్తుందని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా తానే కేసీఆర్ కు ఈ ప‌థ‌కంపై కొన్ని సలహాలు ఇచ్చానని... డబ్బులన్నీ దళితుల అకౌంట్లో చేరుతాయని మోత్కుపల్లి అన్నారు. అంతేకాకుండా ఈ సందర్భంగా ఈటెల పై సంచలన ఆరోపణలు చేశారు ఈట‌ల వంద‌ల ఎక‌రాలు క‌బ్జా చేశారని వేల కోట్లు సంపాదించాలని  మోత్కుప‌ల్లి ఆరోపించారు. హుజురాబాద్ లో టీఆర్ ఎస్ ను గెలిపించాల‌ని అన్నారు. దీని పై ఈట‌ల స్పందిస్తూ... తాను వందల మంది పై కేసులు పెట్టించారని వందల కోట్లు.. వేల కోట్లు సంపాదించాన‌ని మోత్కుప‌ల్లి ఆరోప‌ణ‌లు చేస్తున్నారని... విమర్శలు చేసేటప్పుడు గత చరిత్ర గుర్తు చేసుకోవాలని మోత్కుపల్లి నర్సింహులుకు హితవు పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: