రేవంత్ రెడ్డి అధికార తెరాసపై తన విమర్శలతో నిప్పులు కురిపిస్తున్నాడు. ముఖ్యంగా పెట్రోల్ మరియు డీజల్ ధరలను పెంచినందుకు ధర్నాలు చేయడం, నిరుద్యోగులకు మద్దతుగా ఉండడం మరియు ఇతర సమస్యలపై తన గొంతు బలంగా వినిపిస్తున్నారు. ఈ విధంగా రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ కాంగ్రెస్ బలంగా పుంజుకోవడానికి ప్రయత్నిస్తుంటే....అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ అధిష్టానం మాత్రం వింత ప్రవర్తనతో రాష్ట్ర నేతల ఉత్సాహాన్ని నీరుగారుస్తున్నారని చెప్పాలి. ఇంతకీ విషయం ఏమిటంటే బీజేపీని రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించడానికి కాంగ్రెస్ పార్టీనేత కపిల్ సిబాల్ ఆధ్వర్యంలో 12 పార్టీల నేతలకు విందు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విందులో గులాబీ పార్టీ నేతలు కూడా హాజరయ్యారు.
అయితే తెలంగాణకు అత్యంత క్లిష్ట పరిస్థితులలో ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినందుకు తెరాస ఏ విధంగా వ్యవహరించిందో తెలిసిందే. ఇప్పుడు అదే నేతలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విదివ్వడం అనే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గుర్రుగ్గా ఉన్నారు. ఇక్కడేమో కాంగ్రెస్ తెరాస నువ్వా నేనా అన్నట్టు ఉంటే? అక్కడ మాత్రం రెండు పార్టీలు కలిసి భోజనం చేయడం ఎలా అర్ధం చేసుకోవాలంటూ కార్యకర్తలు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగితే తెలంగాణాలో మళ్ళీ కాంగ్రెస్ నేతలు ఇబ్బంది పడక తప్పేలా లేదు. ఈ విధంగా పై వారి రాజకీయం కింది స్థాయిలో నాయకులకు ఇబ్బందిగా మారుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి