ముద్రగడ ఎలానూ సైలెంట్ అయిపోయారు. జగన్ తన తరఫు వాదన వినిపించి, ఎప్పటిలానే తనవంతుగా కార్పొరేషన్ ఒకటి ప్రకటించి, మౌనంగా ఉండిపోయారు. పవన్ మాత్రం కాపులనే నమ్ముకున్న విధంగా మాట్లాడుతున్నారు. ఆ విధంగానే రాజకీయం చేయాలన్నది ఆయన భావన కావొచ్చు. ఆ విధంగా పవన్ ప్రతిపాదనలు సిద్ధం అయితే కాపులు ఎటు వైపు? ఒకటి కాదు రెండు కాదు శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా వరకూ విస్తరించి ఉన్న కాపులు ఎటువైపు?
నిన్నటి వేళ పవన్ తన రాజకీయ ప్రస్థానం పై క్లారిఫికేషన్ ఇచ్చారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో తానెటు అన్నది తేల్చేశారు. అదేవిధంగా కుల రహిత రాజకీయం, కులాల ఐక్యత కోసం పాటుపడడం వంటివి గతంలో చెప్పినవే అయినా మరోసారి చెప్పారు. వాటిపై కూడా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తూనే, ఇంకొన్ని విషయాలూ చెప్పారు. తన పార్టీలో సామాజిక న్యాయం పాటిస్తామని, అన్ని వర్గాలకూ, కులాలకూ ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి..వీటిపై స్పష్టత ఎలా ఉన్నా..వీటి ఆచరణ అన్నది రేపటి వేళ ఎలా ఉన్నా.. ముందు పవన్ వ్యాఖ్యలను అర్థం చేసుకుని, ఆయనను అనుసరించే అభిమానుల్లో ఎందరు రేపు ఓటేస్తారు అన్నదే సస్పెన్స్. గతంలోనూ అభిమానులే నన్ను మోసం చేశారు అని కన్నీటపర్యంతం అయ్యారు. ఇప్పుడదే అభిమానులను కార్యకర్తల రూపంలో చూడాలని పరితపిస్తున్నారు పవన్. సాధ్యమేనా? ఈ ఎన్నికల్లో ఉహు! రానున్న ఎన్నికల్లో కాపులు ఎటువైపు?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి