ఇకపోతే అటు శ్రీవారి ఆలయంలో ప్రతిరోజూ కూడా కోట్ల రూపాయలు హుండీ ఆదాయం వస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇక శ్రీవారి ఆలయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని టిటిడి బోర్డు అటు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా వివిధ ఏర్పాటు చేయడంతో పాటు కొన్ని మంచి పనులకు కూడా ఉపయోగిస్తూ ఉంటుంది. ప్రజలందరికీ మేలు జరిగే విధంగా ఇప్పటికే టీటీడీ బోర్డు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేపట్టింది. ఇకపోతే ఇటీవల మరోసారి టిటిడి బోర్డు ఒక గొప్ప కార్యాచరణకు సిద్ధం అయింది. ఇటీవలే టిటిడి బోర్డు తీసుకున్న నిర్ణయంపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.
తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రి వేదికగా ఇటీవలే శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయాన్ని ప్రారంభించింది టిటిడి బోర్డు. పుట్టుకతోనే గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఇక టీటీడీ బోర్డు ప్రారంభించిన పద్మావతి చిన్న పిల్లలకు హృదయాలయంలో ఉచితంగా చికిత్సలు అందించనున్నారు. అక్టోబర్ 11వ తేదీనా సీఎం జగన్ దీనిని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నెల 12వ తేదీ నుంచి నేరుగా ఓపి సేవలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేకూర్చే ఈ ఆసుపత్రిని రానున్న రోజుల్లో మరింత విస్తరిస్తామని అంటూ టీటీడీ బోర్డు తెలిపింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి