హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా మారిపోయాయి అనే విషయం తెలిసిందే.  అన్ని పార్టీలు కూడా హుజురాబాద్ ఉప ఎన్నికను  ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ్. దీంతో ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి అన్ని పార్టీలు  ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ అయితే  హుజరాబాద్ ఉప ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ను విడుదల కాక ముందు నుంచి ఎన్నో సంచలన హామీలను కురిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది  అధికార టీఆర్ఎస్ పార్టీ.



 అయితే హుజరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ఇస్తున్న హామీలు తీవ్రస్థాయిలో విమర్శల పాలు అవుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  గతంలో ఉప ఎన్నికల సమయంలో ఇచ్చి నెరవేర్చని హామీలను సైతం ఇటీవల ఉప ఎన్నికల ప్రచారంలో మరోసారి టీఆర్ఎస్ నేతలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే విశ్లేషకులు మాత్రం టీఆర్ఎస్ నేతలు ఇస్తున్న హామీలు పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  హైదరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో దళిత మందు అనే పథకాన్ని ప్రవేశపెట్టి 10 లక్షల రూపాయలు పంపిణీ చేస్తూ ఉండటం సంచలనంగా మారగా.. ఇప్పుడు ఇటీవలే ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఇచ్చిన హామీలపై విశ్లేషకులు మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.



 టిఆర్ఎస్ ను గెలిపిస్తే 57ఏళ్లకే పెన్షన్ అందిస్తాము అంటూ ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.  ఈ హామీపై అటు విశ్లేషకులు మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు వచ్చాయి అంటే చాలు వెనక ముందు ఆలోచించకుండా ఎలాంటి హామీ అయిన ఇచ్చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు.  ఎన్నికలు రాకపోతే ఇలాంటివి ఎందుకు గుర్తుకు రావు అంటూ అడుగుతున్నారు. అంతేకాకుండా 50 వేల నుంచి లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. ఒకప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు పూర్తి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు చేయలేదు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని అదే హామీ ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారు. 70 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామంటూ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కానీ ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఇలాంటి హామీలు ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: